పైసల్లేవ్.. పోటీ చేయలేను.. కాంగ్రెస్ టికెట్ వెనక్కిచ్చేసిన పూరీ లోక్‌సభ అభ్యర్థి
ఒడిశాలో నామినేషన్ల స్వీకరణకు మే 6 వరకు గడువు ఉంది. కేవలం ప్రచారానికి డబ్బుల్లేని పరిస్థితుల్లోనే తాను పోటీ నుంచి తప్పుకున్నానంటూ సుచరిత లేఖ రాయడంతో అక్కడ ఇప్పటికిప్పుడు మరో అభ్యర్థిని వెతకలేక కాంగ్రెస్ తలపట్టుకుంటోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాక ముందే కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగలబోతోంది. ఇప్పటికే సూరత్ స్థానం బీజేపీకి ఏకగ్రీవమయ్యింది. ఇండోర్‌లో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిపోయాయి. దీంతో బ్యాటింగ్ ప్రారంభించకముందే కాంగ్రెస్ రెండు వికెట్లు కోల్పోయినట్లయింది. ఇప్పుడు మూడో వికెట్ పడేలా కనిపిస్తోంది. ప్రచారానికి తన దగ్గర డబ్బుల్లేవని, పార్టీ ఏమీ నిధులివ్వడం లేదని ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిని తన టికెట్‌ను వెనక్కిచ్చేశారు.
జర్నలిస్ట్ అయిన సుచరిత మొహంతి పదేళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు పూరీ లోక్‌సభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. అయితే పార్టీ నిధులు సమకూర్చడం లేదని, తన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయామని సుచరిత చెప్పారు. క్రౌడ్ ఫండింగ్‌తో ప్రజల నుంచి డబ్బులు కోరినా పెద్దగా ఫలితం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయలేనంటూ తన టికెట్‌ను పార్టీకి తిరిగిచ్చేశారు.
నామినేషన్లకు ఇంక రెండు రోజులే
ఒడిశాలో నామినేషన్ల స్వీకరణకు మే 6 వరకు గడువు ఉంది. కేవలం ప్రచారానికి డబ్బుల్లేని పరిస్థితుల్లోనే తాను పోటీ నుంచి తప్పుకున్నానంటూ సుచరిత లేఖ రాయడంతో అక్కడ ఇప్పటికిప్పుడు మరో అభ్యర్థిని వెతకలేక కాంగ్రెస్ తలపట్టుకుంటోంది.
అసలే బలం లేదంటే ఇదో దెబ్బ
ఒడిశాలో కాంగ్రెస్‌ది నామమాత్రపు పోటీయే. 21 పార్లమెంట్ స్థానాలున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఒక్క కొరాపుట్‌లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అదీ కూడా 3వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి శంకర్ బయటపడ్డారు. నబరంగ్‌పూర్‌లో మంచి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. మిగతా అన్నిచోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలతో కలిసి ముందుకెళ్తున్న కాంగ్రెస్‌కు క్యాండేట్లు చేజారిపోవడం కొత్త తలనొప్పిగా మారింది.