Telugu Global
National

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. - స్పీక‌ర్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నోటీసులు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు కీల‌క అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. - స్పీక‌ర్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నోటీసులు
X

కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మాన అస్త్రం ప్ర‌యోగించేందుకు విప‌క్షాలు సిద్ధ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా లోక్‌స‌భ‌లో కేంద్ర‌ ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ నేత గౌర‌వ్ గొగొయ్ స్పీక‌ర్‌కు నోటీసులిచ్చిన‌ట్టు ఆ పార్టీ నేత మాణికం ఠాగూర్ వెల్ల‌డించారు. అలాగే బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కూడా స్పీక‌ర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అంద‌జేశారు.

కీల‌క అంశాలపై చ‌ర్చే ల‌క్ష్యం..

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు కీల‌క అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్‌కు కాంగ్రెస్, బీఆర్ఎస్ నోటీసులిచ్చాయి.

మెజారిటీ లేకున్నా..

లోక్‌స‌భ‌లో విప‌క్షాలకు మెజారిటీ లేదు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఎన్డీఏ కూట‌మికి లోక్‌స‌భ‌లో 330 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంది. 'ఇండియా'కు 140 మంది సభ్యులున్నారు. ఏ కూటమిలోనూ లేనివారు మరో 60 మందికి పైనే ఉన్నారు. ఈ నోటీసుల‌పై స్పీక‌ర్ ఎలా స్పందిస్తార‌నేది వేచిచూడాలి.

First Published:  26 July 2023 11:46 AM IST
Next Story