Telugu Global
National

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ బిగ్‌ జీరో

ఎక్కడా ప్రభావం చూపలేకపోయిన హస్తం పార్టీ

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ బిగ్‌ జీరో
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా మూడోసారి బిగ్‌ జీరో సొంతం చేసుకుంది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ ఒక్క స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రభావం చూపించలేకపోయింది. ఎర్లీ ట్రెండ్స్‌ లో ఒకటి, రెండు స్థానాల్లో కాస్త ఆదిక్యం కనబరిచినా ఆ తర్వాత రౌండ్స్‌ లో వెనకబడింది. 90 శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారంటే హస్తం పార్టీని ఢిల్లీ ప్రజలు ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమవుతోంది. కాంగ్రెస్‌ నేతలు చెప్తున్న విశ్లేషణలు ఇంకోలా ఉన్నాయి. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీని నిలువరించడానికి తమ పార్టీ ఓటర్లు బీజేపీ వైపు నిలిచారని.. ఒకసారి ఢిల్లీలో ఆప్‌ ను అధికారానికి దూరం చేస్తే ఆ స్థానంలోకి తాము రావొచ్చనేది తమ పార్టీ వ్యూహమని చెప్తున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో హస్తం పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఢిల్లీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఎలక్షన్‌ కమిషన్‌ లెక్కల ప్రకారం (మధ్యాహ్నం 2 గంటల వరకు) బీజేపీకి 37,81,710 ఓట్లు పోల్‌ కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 35,68,848 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ 5,23,059 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు.

First Published:  8 Feb 2025 2:10 PM IST
Next Story