Telugu Global
National

ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ ఎక్స్ పీరియన్స్.. వాళ్లంతా ఇక ఇంటికే

ఇటీవల ఇలాంటి ఫేక్ ఎక్స్ పీరియన్స్ వారిని యాక్సెంచర్ తొలగించింది. తాజాగా అదే బాటలో కాగ్నిజెంట్ కూడా పయనిస్తోంది.

ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ ఎక్స్ పీరియన్స్.. వాళ్లంతా ఇక ఇంటికే
X

ఐటీ రంగం సంక్షోభంలో ఉందా..? ఇప్పటికే వేలాది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ట్విట్టర్, మెటా వంటి సంస్థలు కూడా ఉద్యోగుల్ని వదిలించుకుంటున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు పూర్తిగా రిక్రూట్ మెంట్లు ఆపేశాయి. ఈ దశలో చిన్నా చితకా సంస్థల పరిస్థితి ఏంటి..? ఆయా సంస్థలు కూడా తమ ఖర్చులు తగ్గించుకునే పని ప్రారంభించాయి. ఉన్నఫళంగా ఉద్యోగుల్ని తీసివేయడం కోసం సాకులు వెదుకుతున్నాయి. గతంలో ఫేక్ సర్టిఫికెట్స్, ఫేట్ ఎక్స్ పీరియన్స్ తో ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగిస్తున్నట్టు ప్రకటించాయి కొన్ని సంస్థలు.

ఇటీవల ఇలాంటి ఫేక్ ఎక్స్ పీరియన్స్ వారిని యాక్సెంచర్ తొలగించింది. తాజాగా అదే బాటలో కాగ్నిజెంట్ కూడా పయనిస్తోంది. వాస్తవానికి ఫేక్ సర్టిఫికెట్స్, ఫేక్ ఎక్స్ పీరియన్స్ అనేది రిక్రూట్ మెంట్ దశలోనే చెక్ చేసుకోవాలి. ఆ టైమ్ లో హడావిడి పడి, ఫ్రెషర్స్ తక్కువ జీతానికి వస్తున్నారు కదా అని ఎడాపెడా పోస్టింగ్ లు ఇచ్చేస్తాయి కొన్ని కంపెనీలు. తీరా సంక్షోభం ఎదురైతే.. అవే ఫేక్ సర్టిఫికెట్స్ సాకు చెబుతూ ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తుంటాయి.

కరోనా బ్యాచ్ కి కష్టకాలం..

ఇటీవల కరోనా సమయంలో చాలామంది సులభంగా ఐటీలో చోటు సంపాదించారు. కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూలు, ఆన్ లైన్ హెచ్ఆర్ రౌండ్లతో ఉద్యోగంలో చేరి, విధులు కూడా ఆన్ లైన్లోనే నిర్వహిస్తున్నవారు చాలామందే ఉన్నారు. కరోనా టైమ్ లో వీరంతా వర్క్ ఫ్రమ్ హోమ్ తోనే తమ కెరీర్ మొదలు పెట్టారు. అలాంటి వారిలో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టినవారు కూడా బాగానే ఉన్నారు. వారందరి ఉద్యోగాలకు ఇప్పుడు ముప్పు ఏర్పడింది. బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో ఏరివేత మొదలు పెట్టాయి కొన్ని కంపెనీలు. మిగతా కంపెనీలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి ఇదే ఆప్షన్ ని ఎంపిక చేసుకుంటే మాత్రం ఫేక్ సర్టిఫికెట్స్ తో ఎంట్రీ ఇచ్చినవారంతా కష్టాలు ఎదుర్కోవాల్సిందే.

First Published:  13 Nov 2022 1:46 PM IST
Next Story