యూపీ రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు
యూపీలో ఘోర ప్రమాదం జరిగింది
BY Vamshi Kotas11 Jan 2025 5:21 PM IST

X
Vamshi Kotas Updated On: 11 Jan 2025 5:21 PM IST
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కనౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దాదాపు 30 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం. కాగా సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలను రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తక్షణమే బయటికి తీసుకు వచ్చేలా చూడాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.
Next Story