Telugu Global
National

ప్రధానిగా మోడీ తప్పుకొని మరొకరికి అవకాశమివ్వాలి

ప్రభుత్వ ఏర్పాటుకు ఈరోజు తమ కూటమి ముందుకు రాలేదు అంటే.. రేపు కూడా అదే వైఖరి ఉంటుందన్న అర్థం కాదని మమతా స్పష్టం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాబోమని ఆమె తెలిపారు.

ప్రధానిగా మోడీ తప్పుకొని మరొకరికి అవకాశమివ్వాలి
X

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినందున, ఆయన పక్కకు తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బీజేపీ సారథ్యంలో ఏర్పాటవుతున్న బలహీనమైన, అస్థిర ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతే తాను సంతోషిస్తానని ఆమె చెప్పారు. బీజేపీ అప్రజాస్వామిక విధానంలో అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. భవిష్యత్తులో ఇండియా కూటమి పాలన చూస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. టీఎంసీ ఎంపీలు, సీనియర్‌ నేతలతో శనివారం కోల్‌కతాలో జరిగిన సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఈరోజు తమ కూటమి ముందుకు రాలేదు అంటే.. రేపు కూడా అదే వైఖరి ఉంటుందన్న అర్థం కాదని మమతా స్పష్టం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాబోమని ఆమె తెలిపారు. తమను ఎవరూ ఆహ్వానించలేదని, హాజరుకావాలని తాము కూడా కోరుకోవడం లేదని అన్నారు. టీఎంసీ వేచిచూసే వైఖరి అనుసరిస్తుందని చెప్పారు. జేడీయూ, టీడీపీ తమకు మిత్రపక్షాలేనని, ఆ పార్టీలు తమతో లేవని మీకు ఎవరు చెప్పారంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఎదురు ప్రశ్నించారు. కొత్త లోక్‌సభలో టీఎంసీ నేతగా సుదీప్‌ బందోపాధ్యాయ్‌ వ్యవహరిస్తారని మమత వెల్లడించారు.

First Published:  9 Jun 2024 9:12 AM IST
Next Story