Telugu Global
National

మూడు రాజధానుల కేసు నుంచి తప్పుకున్న సీజేఐ

కేసు తన ముందు విచారణకు రాగానే ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు సీజేఐ ప్రకటించారు. తాను లేని వేరొక ధర్మాసనానికి కేసును బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

మూడు రాజధానుల కేసు నుంచి తప్పుకున్న సీజేఐ
X

ఏపీ రాజధానుల పిటిషన్‌ విచారణ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ తప్పుకున్నారు. అమరావతిలోనే రాజధానిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం ఇది వరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

నేడు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉంది. కేసు తన ముందు విచారణకు రాగానే ఈ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు సీజేఐ ప్రకటించారు. తాను లేని వేరొక ధర్మాసనానికి కేసును బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

ఏపీ రాజధానులకు సంబంధించిన వ్యవహారాలతో లింక్ ఉన్న కేసుల్లో గతంలో లాయర్‌గా తాను కూడా వాదనలు వినిపించానని.. కాబట్టి ఈకేసును తాను విచారించడం సరికాదని సీజేఐ స్పష్టం చేశారు. తాను లేని మరో ధర్మాసనం ఈ కేసును విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. పిటిషన్ విచారణకు ఒక తేదీని ఇవ్వాలని లాయర్లు కోరగా.. అందుకు కూడా ఆయన నిరాకరించారు.ఈ కేసును తాను విచారించడం లేదని కేసును విచారించే ధర్మాసనమే తదుపరి తేదీని కూడా నిర్ణయిస్తుందని సీజేఐ స్పష్టత ఇచ్చారు.

First Published:  1 Nov 2022 7:28 AM GMT
Next Story