క్రిస్టియన్లు, ముస్లింలలో వెనుకబాటుతనం లేదు.. ఎస్సీ కోటా వారికి అనవసరం'
దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ 1950లో రాజ్యంగంలో పొందు పరిచారు. అందుకు ఎంతో డేటాను సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ డేటా ప్రకారం క్రిస్టియన్లు, ముస్లింలు వెనుకబాటుకు గురి కాలేదని, అణచివేత కూడా ఆయా మతాల్లో లేదని కేంద్రం తెలిపింది.
క్రిస్టియన్లు, ముస్లింలలో వెనుకబాటుతనం లేదని, ఆ రెండు మతాల్లో అణచివేత కూడా ఉండదని.. అందుకే వారికి ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అదించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. క్రిస్టియన్, ముస్లిం మతాల్లో ఉన్న దళితులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఓ స్వచ్చంధ సంస్థ పిల్ దాఖలు చేసింది. దీనిపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు వివరణ అడగ్గా.. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. 1950 కాన్‌స్ట్యూషన్ ఆర్డర్ (షెడ్యూల్ క్యాస్ట్) కి ఎలాంటి విఘాతం కలగడం లేదని చెప్పింది. ముస్లిం, క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించకపోవడం సరైనది, న్యాయమైనదిగా పేర్కొన్నది.
దళితులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తూ 1950లో రాజ్యంగంలో పొందు పరిచారు. అందుకు ఎంతో డేటాను సేకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ డేటా ప్రకారం క్రిస్టియన్లు, ముస్లింలు వెనుకబాటుకు గురి కాలేదని, అణచివేత కూడా ఆయా మతాల్లో లేదని కేంద్రం తెలిపింది. హిందూ మతం నుంచి వాళ్లందరూ క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లోకి మారిందే అణచివేత నుంచి బయటపడతామనే ఉద్దేశంతో అని, అలాగే రెండు మతాలు అంటరానితనానికి దూరంగా ఉంటాయి. ఇక వారికి ఎస్సీ రిజర్వేషన్ల అవసరం ఏముందని కేంద్రం అఫిడవిట్‌లో వెల్లడించింది.
సామాజికంగా వివక్షకు గురవుతున్న వర్గాల అభ్యున్నతి కోసమే షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లు మొదలయ్యాయి. కొన్ని వర్గాలకు మాత్రమే ఉద్దేశించి, ఎంతో డేటాను సమీకరించి ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు. ఇప్పుడు వాటిలో క్రిస్టియన్లు, ముస్లింలను చేర్చాలనడం భావ్యం కాదని కేంద్రం చెప్పింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా అంగకరించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దళిత క్రిస్టియన్లు, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలని సదరు కమిషన్ సిఫార్సు చేసింది. అయితే, ఆ నివేదిక విస్తృతంగా అధ్యయనం చేయకుండా ఇచ్చిందేనని కేంద్రం ఆరోపించింది.