Telugu Global
National

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వెనక చైనా కుట్ర.... మహేష్ జఠ్మలానీ సంచలన ఆరోపణలు

దీనికి రుజువుగా ఆయన, హువావే నుండి BBC డబ్బు తీసుకుంటోందని UK మ్యాగజైన్ 'ది స్పెక్టేటర్' ఆగస్ట్ 2022 లో ప్రచురించిన కథనానికి సంబంధించిన లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వెనక చైనా కుట్ర.... మహేష్ జఠ్మలానీ సంచలన ఆరోపణలు
X

గుజరాత్ అల్లర్లపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ వెనక చైనా కుట్ర ఉందని బీజేపీ ఎంపీ,సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ ఆరోపించారు. చైనాకు చెందిన 'లింక్డ్ హువావే' అనే సంస్థ బీబీసీకి డబ్బులు ఇచ్చిందని ఆయన అన్నారు.

దీనికి రుజువుగా ఆయన, హువావే నుండి BBC డబ్బు తీసుకుంటోందని UK మ్యాగజైన్ 'ది స్పెక్టేటర్' ఆగస్ట్ 2022 లో ప్రచురించిన కథనానికి సంబంధించిన లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

''బీబీసీ వద్ద నిధులు లేవు. ఆ సంస్థకు ప్రస్తుతం డబ్బుల అవసరం చాలా ఉంది. అందుకే అది చైనాకు చెందిన లింక్డ్ హువావే నుండి డబ్బులు తీసుకుంది.'' అని జెఠ్మలానీ అన్నారు. బీబీసీకి కామ్రేడ్ జయరాం రమేష్ కూడా ఫాలోయరే అని ఆయన‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ విషయంపై బిజెపి నాయకుడు అమిత్ మాల్వియా ఇండియా టుడే తో మాట్లాడుతూ, భారత దేశ అభివృద్దిని దెబ్బతీయడానికి చైనా చేస్తున్న అనేకనేక ప్రయత్నాల్లో ఇది ఒకటి. చైనీస్ కంపెనీలు గత రెండు సంవత్సరాలుగా బీబీసీని కంట్రోల్ చేస్తున్నాయని అందరికి తెలిసిన విషయమే. అని ఆయన అన్నారు.

First Published:  31 Jan 2023 9:40 PM IST
Next Story