Telugu Global
National

'రావ‌ణుడి త‌ల‌లు' కాల‌లేద‌ని ఓ ఉద్యోగిపై స‌స్పెన్ష‌న్‌వేటు!

రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్రమంలో రావణుడి తలలు కాలలేదని ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు చత్తీస్ గడ్ అధికారులు. మొండెం మాత్రమే కాలి తలలు కాలకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ అధికారులు దానికి బాధ్యుణ్ణి చేస్తూ ఓ క్లర్క్ ను సస్పెండ్ చేశారు.

రావ‌ణుడి త‌ల‌లు కాల‌లేద‌ని ఓ ఉద్యోగిపై స‌స్పెన్ష‌న్‌వేటు!
X

ద‌స‌రా ఉత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా జ‌రిగే రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం ఓ ఉద్యోగి స‌స్పెన్ష‌న్ కు దారితీసింది. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంటారు. ప‌ది త‌ల‌ల‌తో ఏర్పాటు చేసిన రావ‌ణుడి బొమ్మ స‌రిగ్గా కాల‌కుండా కొన్ని త‌ల‌లు మిగిలి పోవ‌డంపై చ‌త్తీస్ గ‌ఢ్ లో రాజేంద్ర యాద‌వ్ అనే మునిసిప‌ల్ ఉద్యోగి ని స‌స్పెండ్ చేశారు. చ‌త్తీస్ గ‌ఢ్ లోని ధామ్‌తారి మునిసిప‌ల్ కార్పోరేష‌న్ ఈ రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది. పండ‌గ రోజున జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రావ‌ణుడి బొమ్మ‌కు ఉన్న కొన్ని త‌ల‌లు త‌గ‌ల‌బ‌డలేదు. మొండెం మాత్ర‌మే ద‌గ్ధ‌మై త‌ల‌లు మిగిలిపోయాయి.

ఈ సంఘ‌ట‌న దంతారి కార్పోరేష‌న్ ప్ర‌తిష్ట మంట‌గ‌లిసింద‌ని ఉన్న‌తాధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రావ‌ణుడి బొమ్మ త‌యారీ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పిన క్ల‌ర్క్ రాజేంద్ర యాద‌వ్ విధుల నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఆయ‌న్ను స‌స్పెండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నలుగురు అధికారులు - అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా , సబ్-ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్ర ల‌కు డిఎంసి షో -కాజ్ నోటీసులు జారీ చేసింది.

దిష్టిబొమ్మను తయారు చేసే బాధ్యతను అప్పగించిన వారిపై చర్యలు తీసుకున్నామని ధామ్‌తరి మేయర్ విజయ్ దేవాంగన్ తెలిపారు. ఈ ప‌నికి అయిన బిల్లుల చెల్లింపును నిలిపివేస్తున్నామ‌ని మేయ‌ర్ తెలిపారు. ఈ బొమ్మ‌ను త‌యారు చేసిన క‌ళాకారులు నిర్ల‌క్ష్యంగా వ్యవహరించారని మునిసిప‌ల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.

First Published:  7 Oct 2022 5:11 PM IST
Next Story