అపార్ట్‌మెంట్‌పై నుంచి పడిపోయిన చిన్నారి.. నెలరోజులకు తల్లి సూసైడ్..ఎందుకంటే..!
సరిగ్గా నెల కిందట చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి ప్రమాదవశాత్తు 8నెలల చిన్నారి కింద పడటం.. ఆమెను అపార్ట్‌మెంట్ వాసులు చాకచక్యంగా కాపాడటం అందిరికీ గుర్తుండే ఉంటుంది. ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. అయితే ఘటన జరిగిన నెలరోజుల తర్వాత చిన్నారి తల్లి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది.

చంపిన ట్రోలింగ్..
చిన్నారి పట్ల తల్లిపై వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బిడ్డను కనీసం పట్టించుకోవా?. నువ్వేం తల్లివి? అంటూ సోషల్ మీడియా వేదిక జనాలు కామెంట్లు పెట్టారు. మీడియాలోనూ ఆమెపై నెగిటివ్ కథనాలు వెలువడ్డాయి. రోజురోజుకూ వేధింపులు పెరుగుతూ పోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా చిన్నారి తల్లి రమ్య కోయంబత్తూర్ కరమడైలోని పుట్టింటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు వచ్చేసరికి రమ్య స్పృహలో లేకపోవటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
అసలేం జరిగిందంటే..
చెన్నై - వీజీఎన్ స్టాఫర్డ్ అపార్ట్‌మెంట్ నాలుగో ఫ్లోర్‌లో వెంకటేష్, రమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. గతనెల 28వ తేదీన నాలుగో ఫ్లోర్‌లో తన కుమార్తె హైరిన్‌ను చంకలో ఎత్తుకుని ఇంటి బాల్కనీలో నిల్చుంది రమ్య. ఆ సమయంలో ప్రమాదవశాత్తు చిన్నారి కిందపడిపోయింది. నాలుగో అంతస్తు నుంచి రెండో ఫ్లోర్ బాల్కనీ పైకప్పుపై పడి ఇరుక్కుంది. చిన్నారి పడిన శబ్దం విన్న అపార్ట్‌మెంట్ వాసులు ఒక్కసారిగా బయటకొచ్చారు. చాకచక్యంగా వ్యవహరించి చిన్నారిని కాపాడారు. చిన్నారి అపుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ.. ట్రోలింగ్ భూతం ఇవాళ చిన్నారికి తల్లిని దూరం చేసింది.