Telugu Global
National

బీజేపీ ఇప్పటికైనా స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్లను మార్చాలి... తేజస్వీ యాదవ్

పదే పదే మాపై దాడులు చేస్తున్నారు కానీ వారికేమీ దొరకడం లేదు. వారు నా సోదరీమణుల ఇళ్లపై, వారి అత్తమామలపై దాడి చేశారు. వారు ధరించిన ఆభరణాలను తీయించి వాటి ఫోటోలను తీసుకొని వాటిని సీజ్ చేసినట్టు ED పత్రికా ప్రకటన విడుదల చేసింది. అని ట్వీట్ చేసారు తేజస్వీ యాదవ్.

బీజేపీ ఇప్పటికైనా స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్లను మార్చాలి... తేజస్వీ యాదవ్
X

ఉద్యోగాలు ఇచ్చి భూములు తీసుకున్నారన్న కేసుకు సంబంధించి పలు రాష్ట్రాల్లో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, అతని కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు జరిపిన మూడు రోజుల తర్వాత, తేజస్వి యాదవ్ ఈడీ దాడులను ఖండించారు. తన మీద వచ్చిన‌ ఆరోపణలను కొట్టిపారేశారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల కక్ష సాధిం పు రాజకీయాల్లో భాగమని ఆయన ఆరోపించారు.

"వారి అబద్ధాలకు, పుకార్లకు, రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా పోరాడటానికి ధైర్యం అవసరం. మాకు గుండె ధైర్యం, చిత్తశుద్ధి ఉన్నాయి. ఇలాంటి ప్రయత్నాలు నిరంతరం జరుగుతాయని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజునే చెప్పాను" అని ఆయన అన్నారు.

ఇటీవలి దాడుల్లో 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన నేరాలను గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదనను ప్రస్తావిస్తూ, 2017 దాడుల్లో తాము వెలికితీసినట్లు పేర్కొన్న 8,000 కోట్ల రూపాయల మనీలాండరింగ్ రాకెట్ వివరాలను ముందుగా తమకు అందించాలని ఆయన‌ డిమాండ్ చేశారు. ''దీనికి అమిత్ షా దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికైనా ఆయన‌ స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్లను మార్చాలి. ఒకే విషయాన్ని పదేపదే చెప్తే మంచిగా అనిపించదు.'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు తేజస్వీ.

పదే పదే మాపై దాడులు చేస్తున్నారు కానీ వారికేమీ దొరకడం లేదు. వారు నా సోదరీమణుల ఇళ్లపై, వారి అత్తమామలపై దాడి చేశారు. వారు ధరించిన ఆభరణాలను తీయించి వాటి ఫోటోలను తీసుకొని వాటిని సీజ్ చేసినట్టు ED పత్రికా ప్రకటన విడుదల చేసింది. వారి దగ్గర పంచనామా (స్పాట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్) ఉంటుంది కదా, అది నా దగ్గర కూడా ఉంది. ఈడీ పంచనామా విడుదల చేయాలి లేదా నేను చేస్తాను అని ట్వీట్ చేసారు తేజస్వీ యాదవ్.

"బిహార్ ప్రభుత్వం నుండి మేము వారిని తొలగించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు నిరాశకు గురవుతున్నారు" అని ఆయన అన్నారు.

First Published:  14 March 2023 11:31 AM GMT
Next Story