డేంజర్‌లో చంద్రయాన్-3.. ఇస్రో ఛైర్మన్ షాకింగ్ కామెంట్స్..!
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రునిపై అడుగుపెట్టిన ల్యాండర్, రోవర్‌కు ఇప్పటికీ ముప్పు పొంచి ఉందన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. భూమి మీద ఉన్నట్టు చంద్రుడిపై వాతావరణం ఉండదన్నారు సోమనాథ్.
చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ కావడంతో స్పేస్ సెక్టార్‌లో ఇండియా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈనెల 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వచ్చి తన పని ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన 30 సెకన్ల వీడియోను ఇస్రో ట్విట్టర్‌లో షేర్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రునిపై అడుగుపెట్టిన ల్యాండర్, రోవర్‌కు ఇప్పటికీ ముప్పు పొంచి ఉందన్నారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. భూమి మీద ఉన్నట్టు చంద్రుడిపై వాతావరణం ఉండదన్నారు సోమనాథ్. ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండర్‌ను లేదా రోవర్‌ను ఏ క్షణమైనా ఆస్టరాయిడ్స్, ఇసుక రేణువులు ఢీ కొట్టే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ల్యాండర్, రోవర్ పూర్తిగా దెబ్బతింటాయన్నారు. భూమిని సైతం రోజుకు లక్షల్లో ఆబ్జెక్ట్స్ ఢీ కొంటాయని.. కానీ వాటి ప్రభావం మనకు తెలియదన్నారు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి రాగానే నాశనమవుతాయన్నారు. ఇక ల్యాండర్, రోవర్‌కు థర్మల్ సమస్యతో పాటు.. కమ్యూనికేషన్ బ్లాకవుట్ సమస్యలు ఉండే అవకాశం ఉందన్నారు.
ఇక ఇస్రో.. శుక్రవారం ఉదయం ల్యాండర్ గురించి ఓ అప్‌డేట్ షేర్ చేసింది. అందులో చంద్రయాన్-3 ల్యాండర్‌ను చంద్రయాన్-2 ఫొటో తీసిందని చెప్పింది. నా నిఘా నీపై ఎప్పుడూ ఉంటుంది. చంద్రయాన్-3 ల్యాండర్‌తో చంద్రయాన్-2 ఆర్బిటర్ ఫొటోషూట్. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న కెమెరాల్లో చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని హై-రిజల్యూషన్ కెమెరాకు బెస్ట్ రిజల్యూషన్ ఉంది. చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన తర్వాత తీసిన ఫొటోలు అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌ను కొద్దిసేపటి తర్వాత ఇస్రో తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించింది. ట్వీట్‌ను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టత లేదు.
*