మంకీపాక్స్ ఎఫెక్ట్, కేంద్రం కీలక ఆదేశాలు
చివరగా ఈ ఏడాది మార్చిలో ఓ కేసు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి మంకీపాక్స్ కేసులు లేవని స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎయిర్‌పోర్టులు, పోర్టులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలను సైతం అలర్ట్ చేసింది.
మంకీపాక్స్ కేసులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా హాస్పిటల్స్‌లో అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. ఈ హాస్పిటల్స్‌ను నోడల్ సెంటర్లుగా గుర్తించి ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని సూచించింది. 2022 తర్వాత ఇండియాలోనూ 30 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయని, చివరగా ఈ ఏడాది మార్చిలో ఓ కేసు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి మంకీపాక్స్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఇక వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు దేశంలో ప్రస్తుతం 32 టెస్టింగ్ ల్యాబోరేటరీలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది.
మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 99 వేల 176 కేసులు నమోదైనట్లు తెలిపిన WHO.. 208 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది. 116 దేశాలకు మంకీపాక్స్ విస్తరించిందని తెలిపింది. ప్రస్తుతం ఆఫ్రికన్ దేశం కాంగోలో మంకీపాక్స్ తీవ్రత అధికంగా ఉంది.