చైనాలో మరో మహమ్మారి.. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం
చైనాలో విజృంభిస్తున్న ఈ అంతు చిక్కని వ్యాధి కారణంగా హాస్పిటల్స్ రద్దీగా మారాయి. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
చైనాలో న్యూమోనియా తరహాలో శ్వాసకోశ సంబంధిత కొత్త వ్యాధి విజృంభిస్తోంది. ఇప్పుడీ కొత్త మహహ్మారి ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని హాస్పిటల్స్‌లో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది.
చైనాలో విజృంభిస్తున్న ఈ అంతు చిక్కని వ్యాధి కారణంగా హాస్పిటల్స్ రద్దీగా మారాయి. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరం వంటి లక్షణాలతో వందలాది మంది చిన్నారులు హాస్పిటల్స్‌లో చేరుతున్నారు.
చైనాలో పరిస్థితిని నిశితంగా పరిశీస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టంచేశారు. చైనాలో న్యుమోనియా తరహా కేసుల ఉద్ధృతిని ICMR, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తుందని వివరించారు.