Telugu Global
National

ఏపీలోని మూడు కీలక ఎయిర్‌పోర్టులు ప్రైవేట్‌పరం!

తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు.

ఏపీలోని మూడు కీలక ఎయిర్‌పోర్టులు ప్రైవేట్‌పరం!
X

దేశంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫ్యాక్టరీలు ఇలా వరుస పెట్టి ప్రైవేట్‌కు అప్పగిస్తున్న మోడీ సర్కార్ ఇప్పుడు ఏపీలోని మరో మూడు కీలకమైన ఎయిర్‌పోర్టులను కూడా ప్రైవేటీకరణ దారి పట్టిస్తోంది. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ రాజ్యసభలో వెల్లడించారు.

దేశంలోని ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణపై కేరళ సీపీఎం సభ్యుడు కరీం అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. దేశంలోని 25 ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయించినట్టు కేంద్ర‌మంత్రి తెలిపారు. 2022-25 మధ్యలో ఈ పని పూర్తి చేస్తామన్నారు. ప్రైవేటీకరణ జాబితాలోని 25 ఎయిర్‌పోర్టుల్లో తిరుపతి, రాజమండ్రి, విజయవాడ ఎయిర్‌పోర్టులు కూడా ఉన్నాయి. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీం కింద వీటిని ప్రైవేటీకరణ జాబితాలో చేర్చారు.

First Published:  20 Dec 2022 4:06 PM IST
Next Story