Telugu Global
National

బీజేపీకి వేల కోట్ల విరాళాలు

ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో 2018-22 మధ్య కాలంలో బీజేపీకి ఏకంగా రూ. 5,270 కోట్లు విరాళాలుగా వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.

బీజేపీకి వేల కోట్ల విరాళాలు
X

కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీకి వేల కోట్ల విరాళాలు వస్తున్నాయి. విరాళాల విష‌యంలో మరే పార్టీ కూడా బీజేపీ దరిదాపుల్లో కూడా లేదు. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో 2018-22 మధ్య కాలంలో బీజేపీకి ఏకంగా రూ. 5,270 కోట్లు విరాళాలుగా వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్ గణాంకాలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. 2018-22 మధ్య కాలంలో మొత్తం 9వేల 208 కోట్ల విలుమైన ఎలక్టోరల్‌ బాండ్లు అమ్ముడుపోయాయి. అందులో 57 శాతం నిధులు బీజేపీకే దక్కాయి.

విరాళాల్లో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌కు రూ. 964 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తం బాండ్లలో ఇది 10 శాతం మాత్రమే. ఆ తర్వాత టీఎంసీకి 767 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం వెల్లడించింది.

2020లో బీజేపీకి అత్యధికంగా 2,555 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. సీపీఐకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో2.87 కోట్లు వచ్చాయి. డీఎంకేకు 431 కోట్లు, టీఆర్‌ఎస్‌కు 383 కోట్లు, వైసీపీకి 329 కోట్లు, ఆప్‌కు 50 కోట్ల రూపాయల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయి.

First Published:  19 Jan 2023 3:22 AM GMT
Next Story