కేంద్ర బడ్జెట్: ఈ సారి రైల్వేలకు భారీ కేటాయింపులు
“భారతీయ రైల్వే లకు 2.40 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం మునుపెన్నడూ లేనిది; ఇది 2013లో కంటే 9 రెట్లు ఎక్కువ ” అని ఆర్థిక మంత్రి అన్నారు. రైల్వేలకు ఈ సారి బడ్జెట్ కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే 65.6 శాతం పెరిగాయి.
ఈ సారి కేంద్ర బడ్జెట్ లో భారతీయ రైల్వేల అభివృద్ధికి రూ.2.40 లక్షల కోట్లు ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రకటించిన సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ, 2013-14 సంవత్సరం తర్వాత భారతీయ రైల్వేలకు అత్యధికంగా కేటాయింపులు చేయడం ఇదేనని అన్నారు.
“భారతీయ రైల్వే లకు 2.40 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం మునుపెన్నడూ లేనిది; ఇది 2013లో కంటే 9 రెట్లు ఎక్కువ ” అని ఆర్థిక మంత్రి అన్నారు. రైల్వేలకు ఈ సారి బడ్జెట్ కేటాయింపులు గత ఏడాదితో పోలిస్తే 65.6 శాతం పెరిగాయి.
ఈ నిధులు రైల్వే లైన్లు, వ్యాగన్లు, రైళ్లు, విద్యుదీకరణ, సిగ్నలింగ్, స్టేషన్ సౌకర్యాల నిర్మాణానికి, భద్రతను మరింత మెరుగుపర్చడానికి ఉపయోగిస్తారు.
అంతే కాక కొత్త వందేభారత్ రైళ్ల అభివృద్ధి, హైడ్రోజన్‌తో నడిచే రైళ్ళు, అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రవేశపెట్టడానికి కూడా నిధులు ఉపయోగిస్తారు.