రాహుల్ గాంధీ యాత్రను ఆపడానికే కేంద్రం కోవిడ్ వైరస్‌ను విడుదల చేసింది: ఉద్ధవ్ సేన
"భారత్ జోడో యాత్రను రాహుల్ విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రభుత్వం చట్టం ద్వారా లేదా కుట్రతో యాత్రను ఆపలేకపోయింది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం 'కోవిడ్ -19' వైరస్‌ను విడుదల చేసినట్లు కనిపిస్తోంది, ” అని ఉద్ధవ్ థాకరే శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ను ఆపేందుకు ప్రభుత్వం కోవిడ్ - 19 వైరస్ ను వదులుతోందని యుబిటి శివసేన(ఉద్దవ్ వర్గం) విమర్శించింది. రాహుల్ గాంధీ యాత్రలో కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని లేదా యాత్రను ఆపేయాలంటూ రాహుల్ గాంధీ, గెహ్లాట్ లకు కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవీయ లేఖ రాయడాన్ని శివసేన తప్పు బట్టింది.
"భారత్ జోడో యాత్రను రాహుల్ విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రభుత్వం చట్టం ద్వారా లేదా కుట్రతో యాత్రను ఆపలేకపోయింది, కాబట్టి కేంద్ర ప్రభుత్వం 'కోవిడ్ -19' వైరస్‌ను విడుదల చేసినట్లు కనిపిస్తోంది, " అని ఉద్ధవ్ థాకరే శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
'భారత్ జోడో' యాత్ర హడావుడి కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతాయనే భయం సరైనదే. కానీ మూడేళ్ల క్రితం కరోనా విధ్వంసం సృష్టించినప్పుడు, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను గుజరాత్‌కు ఆహ్వానించి, లక్షలాది మందిని ఆయన గౌరవార్థం సమీకరించింది మీరే" అని పత్రిక దెప్పి పొడిచింది.
కోవిడ్ నిబంధనలు పాటించాలని లేదా యాత్రను ఆపేయాలంటూ మాండవీయ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న విశేష ప్రజాదరణ చూసి మోడీ ప్రబుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ విమర్శించారు. కేవలం యాత్రను ఆపేందుకే ఇటువంటి లేఖలు రాస్తున్నారన్నారని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని, యాత్రను ఆపాలన్నదే బిజెపి లక్ష్యమని అన్నారు.. మోడీ రెండు రోజుల క్రితం త్రిపురలో ర్యాలీలు నిర్వహించలేదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం ఎక్కడా ప్రొటోకాల్ నిబంధనలు విడుదల చేయలేదు. ఏ రాష్ట్రానికి లేఖలు రాయలేదు. ప్రొటోకాల్ ప్రకటిస్తే వాటిని అనుసరిస్తాం. అవేమీ లేకుండా యాత్రను ఆపేయాలంటే కుదరదని కాం గ్రెస్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. రాజస్తాన్ , కర్ణాటక రాష్ట్రాల్లో బిజెపి నేతలు చేస్తున్న యాత్రలకు లేని నిబంధనలు ఆంక్షలు రాహుల్ గాంధీ యాత్రకే ఎందుకంటూ మరో నేత పవన్ ఖేరా మండిపడ్డారు.