ఆధార్- ఓటర్ కార్డు అనుసంధానానికి కేంద్రం నిర్ణయం
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
BY Vamshi Kotas18 March 2025 9:27 PM IST

X
Vamshi Kotas Updated On: 18 March 2025 9:27 PM IST
ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానానికి ఎన్డీయే సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆధార్‌తో ఓటర్ ఐడీ అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని తెలిపింది. ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అనుసంధానానికి గల సాంకేతిక అంశాలపై UIDAIతో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేశారు. ఇవాళ పలు శాఖల కార్యదర్శులతో సమావేశమైన సీఈసీ ఈ మేరకు వెల్లడించారు.
Next Story