Telugu Global
National

మనీష్ సిసోడియా అరెస్ట్ ను సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు -కేజ్రీవాల్

“చాలా మంది సీబీఐ అధికారులు మనీష్ అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. వారు ఆ విషయాన్ని స్వయంగా నాకే చెప్పారు. వారందరికీ సిసోడియాపై అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులో సిసోడియాపై ఎటువంటి ఆధారాలు లేవు.'' అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

మనీష్ సిసోడియా అరెస్ట్ ను సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు -కేజ్రీవాల్
X

ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కు మద్దతుగా ఆయన అరెస్టును నిరసిస్తూ ఆప్ ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరో వైపు సిసోడియా అరెస్ట్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ, “చాలా మంది సీబీఐ అధికారులు మనీష్ అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. వారు ఆ విషయాన్ని స్వయంగా నాకే చెప్పారు. వారందరికీ సిసోడియాపై అపారమైన గౌరవం ఉంది. ఈ కేసులో సిసోడియాపై ఎటువంటి ఆధారాలు లేవు. కానీ అతనిని అరెస్టు చేయాలనే రాజకీయ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల సీబీఐ అధికారులు తమ బాస్ ల ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తున్నారు.'' అని అన్నారు.

" పేద పిల్లలందరూ పాఠశాలకు వెళ్లేలా మనీష్ సిసోడియా కృషి చేశారు.. అతను అత్యంత నిజాయితీపరుడు. ప్రజల కోసం సిసోడియా తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. మంచి వారిని, నిజాయితీ పరులను, దేశభక్తులను జైళ్ళలో పెడుతున్నారు. బీజేపీ స్నేహితులు మాత్రం బ్యాంకుల నుండి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు." అని కేజ్రీవాల్ విలేకరులతో అన్నారు.

"మనీష్ అరెస్టు బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట. ఆయన‌ను అరెస్ట్ చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు మాతో కలిసి పోరాటం చేస్తారు.''అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

First Published:  27 Feb 2023 12:33 PM IST
Next Story