Telugu Global
National

మధ్యప్రదేశ్ అత్యాచార నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్

మధ్యప్రదేశ్ గుణా జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్ర శారీరక హింసకు గురిచేసి, బతికుండగానే నరకం చూపించిన నిందితుడిపై బుల్డోజర్‌ యాక్షన్ మొదలయ్యింది.

మధ్యప్రదేశ్  అత్యాచార నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్
X

మధ్యప్రదేశ్ గుణా జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్ర శారీరక హింసకు గురిచేసి, బతికుండగానే నరకం చూపించిన నిందితుడిపై బుల్డోజర్‌ యాక్షన్ మొదలయ్యింది. స్థానిక పరిపాలన అధికారులు బుల్డోజర్‌తో నిందితుడి ఇంటికి వచ్చి కూల్చివేత నోటీసులు అంటించారు.అలాగే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నేరం చేసిన స్థలానికి తీసుకువచ్చారు. దాడికి ఉపయోగించిన బెల్ట్, ఫెవిక్విక్ ట్యూబ్ స్వాధీనం చేసుకున్నారు.

సంఘటన వివరాల్లోకి వెళితే .. మధ్యప్రదేశ్ లోని గుణ ప్రాంతంలో శివపురిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నెల రోజులపాటు ఆ యువతి నిందితుడు క్రూరంగా వ్యవహరించాడు. 23 ఏళ్ల బాధిత మహిళ నిందితుడి పక్క ఇంట్లో ఉండే వ్యక్తి. ఒకరోజు ఆవిడ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బలవంతంగా ఎత్తుకు వెళ్లి తన ఇంట్లో ఓ గదిలో నిర్బంధించాడు. యువతిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా యువతిని బెల్టు, పైపుతో కొట్టిడమే కాకుండా, గాయాలు, కళ్లలో కారం పోశాడు. యువతి అరవకుండా పెదాలను ఫెవిక్విక్‌తో మూశాడు. అతికష్టం మీద అతడి నుంచి తప్పించుకున్న యువతి అర్ధరాత్రి ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. మహిళను ముందుగా గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ నుండి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఆమె ముఖమంతా గాయాలతో వాచిపోయింది. వాపు కారణంగా ఆమె కళ్ళు సగం మూతపడ్డాయి.ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. స్థానిక అధికారులు నిందితుడి ఇంటికి కూల్చివేత నోటీసులు అంటించారు. నిందితుడు, అతని సోదరుడు రోజూ కూలీ పనిచేసుకుంటారని స్థానికులు వెల్లడించారు.

First Published:  21 April 2024 10:00 PM IST
Next Story