‘అదానీ చట్టం’ తీసుకురండి: NDA ప్రభుత్వానికి BRS సలహా
పార్లమెంటు వెలపల బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, “మేము ఈరోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని విన్నాము, ఆ ప్రసంగంలో నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు లేనేలేవు. ప్రస్తుతం దేశంలో క్రోనీ క్యాపిటలిజం మాత్రమే నడుస్తోంది. ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోంది , అందువల్ల ‘అదానీ చట్టం’ తీసుకురావాలని ప్రధానికి సూచించాలని రాష్ట్రపతిని కోరుతున్నాను’’ అని అన్నారు.
దేశంలో ఇప్పుడు ‘క్రోనీ క్యాపిటలిజం’ మాత్రమే ఉందని, ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోందని అందువల్ల “అదానీ చట్టం” ప్రవేశపెట్టాలని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును BRS కోరింది.
బడ్జెట్ సమావేశాలకు ముందు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి తొలి ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో పాటు BRS బహిష్కరించింది.
ఈ సందర్భంగా పార్లమెంటు వెలపల బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, “మేము ఈరోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని విన్నాము, ఆ ప్రసంగంలో నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు లేనేలేవు. ప్రస్తుతం దేశంలో క్రోనీ క్యాపిటలిజం మాత్రమే నడుస్తోంది. ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలన నడుస్తోంది , అందువల్ల ‘అదానీ చట్టం’ తీసుకురావాలని ప్రధానికి సూచించాలని రాష్ట్రపతిని కోరుతున్నాను’’ అని అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, పాలనా రంగాల్లో విఫలమైందని కేశవరావు కేంద్రంపై మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు, దేశానికి కేంద్రం చేసిందేమీ లేదని ఆయన ఎత్తిచూపారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని BRS, AAP బహిష్కరించడం ఖచ్చితంగా ప్రజాస్వామికచర్యగా కేశవరావు వర్ణించారు. తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని, తమ బహిష్కరణ కేంద్రం వైఫల్యాలకు నిరసనగా మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలకు వీలులేదా అని ఆయన ప్రశ్నించారు.
“అందరిలాగే మాకు రాష్ట్రపతి పట్ల గౌరవం ఉంది. మేము ఆమెకు వ్యతిరేకం కాదు, కానీ ఎన్‌డిఎ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజాస్వామ్య నిరసన ద్వారా మాత్రమే హైలైట్ చేయాలనుకుంటున్నాము, ”అని ఆయన అన్నారు, కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని,తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాల వ్యవహారాల్లో అప్రజాస్వామికంగా జోక్యం చేసుకుంటోందని కేశవరావు ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, వ్యవసాయ సమస్యలతోపాటు అనేక సమస్యలను బీఆర్‌ఎస్ ప్రత్యేకంగా లేవనెత్తినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగంలో వాటి ప్రస్తావన లేదని లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంటలకు కనీస మద్దతు ధర గురించి కేంద్రం ప్రస్తావించలేదని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోలేదన్నారు.
‘‘రాష్ట్రపతి ప్రసంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మూడు, నాలుగు సార్లు ప్రస్తావించారు. కానీ కొత్త పార్లమెంట్ భవనానికి ఆయన పేరు పెట్టాలన్న మా డిమాండ్ ఆమోదం పొందలేదు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని, కానీ రాష్ట్రంలో అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.