Telugu Global
National

బీపీటీఎంఎం 7వ జాతీయ మహాసభలకు రండి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ఆహ్వానించిన సంఘం నేతలు

బీపీటీఎంఎం 7వ జాతీయ మహాసభలకు రండి
X

భారతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహా సంఘ్‌ (బీపీటీఎంఎం) 7వ త్రైవార్షిక మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కేంద్ర మంత్రిని ఆ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం ఢిల్లీలో బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి అవిశంకర్‌ అల్లూరి, బీఎంఎస్‌ నాయకుడు కల్లోల్‌ భట్టాచార్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు నాగ్‌పూర్‌ లో కేంద్ర మంత్రిని కలిశారు. ఏప్రిల్‌ 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే బీపీటీఎంఎం మహా సభలకు ముఖ్య అతిథిగా రావాలని విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌పోర్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం నాయకులు కేంద్ర మంత్రికి వివరించారు. జాతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్స్‌ కు వన్‌ నేషన్‌ - వన్‌ ట్యాక్స్‌ విధానం తీసుకురావాలని, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కు సబ్సిడీ, ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్స్‌ కు ఇన్సూరెన్స్‌ చెల్లింపులను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీపీటీఎంఎం నాయకులు యోగేశ్‌ శర్మ, రజేశ్‌ వర్మ, హబీబ్‌, శ్రీధర్ రెడ్డి, కంది శ్రీనివాస్‌, కొంకటి శ్రీనివాస్‌, శివకుమార్‌ తదితరులు ఉన్నారు.

First Published:  7 March 2025 5:56 PM IST
Next Story