Telugu Global
National

బెంగళూరులో 15 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు..

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి దగ్గర్లో ఉన్న స్కూల్ కి కూడా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు హడావిడి పడ్డారు.

బెంగళూరులో 15 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు..
X

అప్పుడప్పుడూ స్కూళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్లకు.. బాంబు బెదిరింపు కాల్స్ రావడం మనం వింటూనే ఉంటాం. దాదాపుగా అందులో అన్నీ ఫేక్ కాల్స్ ఉంటాయి. కానీ పోలీసులు మాత్రం ముందు జాగ్రత్తగా తమ డ్యూటీ తాము నిర్వహిస్తారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఆ తర్వాతే ఫేక్ కాల్స్ అని డిక్లేర్ చేస్తారు. అయితే బెంగళూరులో ఒకేసారి 15 స్కూళ్లకు ఈ రోజు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ వ్యవహారం కర్నాటకలో సంచలనంగా మారింది.


బెంగళూరులోని 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కాసేపట్లో ఆ స్కూల్స్ లో బాంబులు పేలతాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ పంపించారు. దీంతో పాఠశాల యాజమాన్యం భయపడింది. వెంటనే స్కూళ్లను ఖాళీ చేయించింది, విద్యార్థులను క్లాస్ రూమ్ ల నుంచి బయటకు పంపించి, తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. కొన్ని స్కూల్స్ పిల్లలను వెనక్కు పంపించేశాయి. పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ లు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ బాంబుల సమాచారం బయటపడలేదు. దీంతో అవి ఉత్తుత్తి బెదిరింపులేననే నిర్థారణకు వచ్చారు.

కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి దగ్గర్లో ఉన్న స్కూల్ కి కూడా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు హడావిడి పడ్డారు. ఉదయం ఒకేసారి 7 స్కూల్స్ కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తర్వాత మరో 8 స్కూల్స్ కి ఇలాగే బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గతేడాది కూడా ఇలాగే బెంగళూరులో ఏడు స్కూల్స్ కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈసారి 15 స్కూల్స్ కి బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బెదిరింపులకు పాల్పడినవారిని గుర్తించే పనిలో పడ్డాయి నిఘా వర్గాలు.


First Published:  1 Dec 2023 6:57 AM GMT
Next Story