బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ బెదిరింపులు
ప్రాణాలతో ఉండాలన్నా.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలన్నా రూ. 5 కోట్లు ఇవ్వాలని వాట్సప్ మెసేజ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వాట్సప్‌లో బెదిరింపులు ఎదురయ్యాయి. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు మెసేజ్ వచ్చింది. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించకుంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ ((ఇటీవల హత్యకు గురైన ఎన్సీపీ నేత) కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌పై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమతమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేస్తున్నామని ముంబాయి పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని ఆయన నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే సల్మాన్‌కు ఇలా బెదిరింపులు రావడం మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్దకు ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం విదితమే. అలాగే అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు యత్నించడం అప్పట్లో కలకలం సృష్టించింది. బాలీవుడ్ నటుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గత ఏడాది ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది.