Telugu Global
National

మోడీపై అమెరికా బిలియనీర్ విమర్శలు...ఇది భారత్ పై దాడే అని కేంద్ర‍ం ఆరోపణలు

జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీరియస్ గా స్పందించారు. అతను ప్రధాని నరేంద్ర మోడీని మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపించారు.

మోడీపై అమెరికా బిలియనీర్  విమర్శలు...ఇది భారత్ పై దాడే అని కేంద్ర‍ం ఆరోపణలు
X

అదానీపై హిండెన్ బర్గ్ నివేదిక దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అవుతున్న నేపథ్యంలో అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆగ్రహం తెప్పించాయి. బీజెపి నాయకులు ఆయనపై మాటల దాడి మొదలు పెట్టారు.

అదానీ వ్యవహారం తర్వాత భారత దేశంలో ప్రజాస్వామ్య పునరుద్దరణ అవసరం కనిపిస్తోందని జార్జ్ సోరోస్ అన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూ రిటీ కాన్ఫ రెన్స్ లో జార్జ్ సోరోస్ మాట్లాడుతూ, మోడీకి, అదానీకి చాలా దగ్గరి సంబంధాలున్నాయని, అదానీపై హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత మోడీ బలహీనపడే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై మోడీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. విదేశీ మదుపర్లు అడుగుతున్న ప్రశ్న లకు ప్రధాని సమాధానం చెప్పాలన్నా రు.

జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీరియస్ గా స్పందించారు. అతను ప్రధాని నరేంద్ర మోడీని మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపించారు.

ఈ యుద్ధం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోంది. ఈ యుద్ధానికి, భారతదేశ ప్రయోజనాలకు మధ్య ఉన్నది మోడీ అని ఆమె విలేకరులతో అన్నారు.

సోరోస్ భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడానికి కొంతమంది వ్యక్తులు కోరుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

భారతదేశంతో సహా ప్రజాస్వామ్య వ్యవస్థల్లో జోక్యం చేసుకోవడానికి అతను ఒక బిలియన్ డాలర్లకు పైగా నిధిని సృష్టించాడని ఆమె పేర్కొంది.

First Published:  17 Feb 2023 5:10 PM IST
Next Story