Telugu Global
National

బీజేపీ నాకు నెగెటివ్ గురువు... రాహుల్ గాంధీ

శనివారం రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “వారు (బిజెపి) మాపై దూకుడుగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయపడుతుంది. నేను వారిని (బిజెపి) నా గురువుగా భావిస్తున్నాను, వారు నాకు మార్గం చూపుతున్నారు. చేయకూడని వాటిపై శిక్షణ ఇస్తున్నారు.'' అని అన్నారు.

బీజేపీ నాకు నెగెటివ్ గురువు... రాహుల్ గాంధీ
X

భారతీయ జనతా పార్టీ తనకు నెగెటీవ్ గురువు అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. ఏం చేయకూడదో తాను బీజేపీని చూసి నేర్చుకుంటున్నట్టు ఆయన అన్నారు.

శనివారం రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, "వారు (బిజెపి) మాపై దూకుడుగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయపడుతుంది. నేను వారిని (బిజెపి) నా గురువుగా భావిస్తున్నాను, వారు నాకు మార్గం చూపుతున్నారు. చేయకూడని వాటిపై శిక్షణ ఇస్తున్నారు.'' అని అన్నారు.

భారత్ జోడో యాత్ర గురించి ఆయన మాట్లాడుతూ, "నేను దీన్ని ప్రారంభించినప్పుడు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాధారణ యాత్రగా భావించాను. ఈ యాత్రకు ఒక గొంతు, కొన్ని భావాలు ఉన్నాయని నెమ్మదిగా అర్థం చేసుకున్నాను.భారత్ జోడో యాత్ర తలుపులు అందరికీ తెరిచి ఉన్నాయి, మాతో చేరకుండా మేము ఎవరినీ ఆపలేము. చేరాలని ఎవరినీ బలవంత పెట్టలేము. అఖిలేష్ , మాయావతి తదితరులు ప్రేమమయమైన భారత దేశాన్ని కోరుకుంటున్నారు" అని అన్నారాయన. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు ఇది తానిచ్చే బహిరంగ ఆహ్వానమని రాహుల్ తెలిపారు.

కాగా సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది.

భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు కూడా ఇంత‌ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించలేదని కాంగ్రెస్ పేర్కొంది.

ఈ యాత్ర ద్వారా, రాహుల్ గాంధీ పార్టీ క్యాడర్‌ను సమీకరించడం, దేశంలో బిజెపి చేస్తున్న విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సాధారణ ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

First Published:  31 Dec 2022 2:05 PM IST
Next Story