బీజేపీ కి ఓటమి భయం... ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్న మోడీ
మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శీతాకాల సమావేశాలను సైతం డిసెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర క్యాబినేట్ రద్దు చేసే యోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉందా ? ఆ పార్టీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోందా ? ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మోడీ సర్కార్ ఈ ఎనిమిదేళ్ళలో తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవడం, కరోనా కాలంలో మోడి సర్కార్ చేతులెత్తేయడం...ఈ కారణాల వల్ల ఇప్పటికే ఆ పార్టీలో ఓడిపోతామనే భయంపట్టుకుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ఇంకా ఆలస్యమైతే ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే శీతాకాల సమావేశాలను సైతం డిసెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర క్యాబినేట్ రద్దు చేసే యోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు పుకార్లు గుప్పుమంటున్నాయి. బిజేపీ నాయకులందరినీ ఇప్పటికే ప్రజల్లో ఉండేలా ఆదేశాలు ఇచ్చిన మోడీ, వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఉద్దేశించిన సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సైతం ఆదేశాలిచ్చారు. దీంతో ఈ వూహాగానాలు మరింత బలపడుతున్నాయి.