ఖర్గే హత్యకు బీజేపీ కుట్ర... కాంగ్రెస్ సంచలన ఆరోపణ
కర్నాటక చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కు, రవి అనే స్థానిక బీజేపీ నేతకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను కర్ణాటక ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా విడుదల చేశారు, ఇందులో ఖర్గే భార్య పిల్లలను తుడిచిపెడతానని రాథోడ్ చెప్పినట్టుగా ఉంది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది.
ఈ మేరకు కర్నాటక చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కు, రవి అనే స్థానిక బీజేపీ నేతకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను కర్ణాటక ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా విడుదల చేశారు, ఇందులో ఖర్గే భార్య పిల్లలను తుడిచిపెడతానని రాథోడ్ చెప్పినట్టుగా ఉంది. చిత్తాపూర్ నియోజకవర్గంలో మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేపై బీజేపీ నేత మణికంఠ రాథోడ్ పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను చూసి బీజేపీ బెదిరిపోయిందని, అందుకే ఏఐసీసీ అధ్యక్షుడిని చంపేందుకు బీజేపీ నాయకత్వం హత్య పథకం పన్నిందని సుర్జేవాలా ఆరోపించారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సిఎం బసవరాజ్ బొమ్మైకి దగ్గరి వ్యక్తి అయిన రాథోడ్ ఆడియో రికార్డింగ్ ద్వారా ఇది స్పష్టమవుతోందని ఆయన అన్నారు.
బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ పై 44 క్రిమినల్ కేసులున్నాయి. అంగన్ వాడీలకు ఇచ్చే పాలు, బియ్యం దొంగతనం చేసిన కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. మణికంఠ రాథోడ్ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇటీవలే రాథోడ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో అది రద్దయింది.
కాగా, బిజెపి నాయకత్వం నిరాశ ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరుకుందని సూర్జేవాలా అన్నారు. "కర్ణాటకలో వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు పాల్పడ్డ 40 శాతం అవినీతి కి సమాధానం చెప్పకుండా తమను కాపాడుకోవడానికి ప్రజల మధ్య విభజన తీసుకరావడానికి రోజుకో ప్రయత్నం చేస్తున్నారు.'' అని సూర్జేవాలా మండిపడ్డారు.
“చివరకు ఈ విభజన వ్యూహాలు కూడా విఫలమవడంతో ఇప్పుడు వారు తమ చివరి ఆయుధంగా హత్యా కుట్రలను చేస్తుస్తున్నారు, ”అని ఆయన అన్నారు.