Telugu Global
National

గాంధీ కుటుంబాన్ని వెంటాడుతున్న బిజెపి ప్ర‌భుత్వం..రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ లైసెన్స్ ర‌ద్దు

గాంధీ కుటుంబ నిర్వ‌హణ‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ , రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేసింది. ఆర్‌జిఎఫ్, ఆర్‌జిసిటిలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి

గాంధీ కుటుంబాన్ని వెంటాడుతున్న బిజెపి ప్ర‌భుత్వం..రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ లైసెన్స్ ర‌ద్దు
X

గాంధీ కుటుంబానికి సంబంధించిన ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీఓలు) విదేశీ విరాళాల‌కు సంబంధించిన లైసెన్స్ ను కేంద్రం ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. గాంధీ కుటుంబాన్ని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వెంటాడి వేధిస్తోంద‌నే విమ‌ర్శ‌ల‌కు తాజా సంఘ‌ట‌న‌తో బ‌లం చేకూరుతోందంటున్నారు. ఇప్ప‌టికే నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా స‌హా కాంగ్రెస్ నేత‌ల‌ను ఈ డి విచారించిన విష‌యం తెలిసిందే.

గాంధీ కుటుంబ నిర్వ‌హణ‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జిఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జిసిటి) విదేశీ విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్‌జిఎఫ్, ఆర్‌జిసిటిలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గాంధీ కుటుంబం నడుపుతున్న ఎన్జీవోలలో అక్రమాలకు పాల్పడినట్లు 2020లో హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్-మంత్రిత్వ కమిటీ (ఇంట‌ర్ మినిస్టీరియ‌ల్ క‌మిటీ)నిర్ధ‌రించింది. దీంతో ప్ర‌భుత్వం ఈ చర్య తీసుకుంది.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆర్‌జిఎఫ్‌కు సారథ్యం వహిస్తుండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సభ్యులుగా ఉన్నారు. అలాగే సోనియా నిర్వ‌హ‌ణ‌లోనే ఉన్న ఆర్ జిసిటి లో రాహుల్ గాంధీ, రాజ్యసభ మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ ఎస్‌.. గంగూలీ సభ్యులుగా ఉన్నారు.

రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ ను 1991లో ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి 2009 వరకు ఆరోగ్యం, సైన్స్, టెక్నాలజీ, విద్య‌, మహిళలు, పిల్లలు, వైకల్యం, వంటి అనేక స‌మ‌స్య‌ల‌పై ప‌ని చేసింది.

First Published:  23 Oct 2022 1:06 PM IST
Next Story