Telugu Global
National

'అక్కడే బీజేపీ ధర్నా ఉంది, మీరు దీక్షా వేదికను మార్చుకోండి'... కవితకు పోలీసుల ఆదేశాలు

మీడియా సమావేశం అయిపోగానే కవిత జంతర్ మంతర్ వద్ద తాను దీక్ష చేయబోయే స్థలం వద్ద ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళారు. కాగా వేదిక మార్చుకోవడనికి కవిత అంగీకరించకపోవడంతో పోలీసులు తాము ముందుగా అనుమతి ఇచ్చిన స్థలంలో సగం స్థలమే వాడుకోవాలని కవితకు సూచించారు.

అక్కడే బీజేపీ ధర్నా ఉంది, మీరు దీక్షా వేదికను మార్చుకోండి... కవితకు పోలీసుల ఆదేశాలు
X

రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆరెస్ ఎమ్మెల్సీ తలపెట్టిన దీక్షా కార్యక్రమం వేదిక మార్చుకోవాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. ఢిల్లీలో కవిత మీడియా సమావేశంలో ఉండగా పోలీసులు ఈ సమాచారాన్ని తెలిపారు.

అయితే చాలా రోజుల ముందే తాము అనుమతి తీసుకున్నామని, తాము ఎంచుకున్న స్థలంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పిన కవిత ఎట్టి పరిస్థితుల్లోనూ తాము వేదిక మార్చుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు ఇప్పుడు మాటమార్చడమేంటని ఆమె ప్రశ్నించారు.

మీడియా సమావేశం అయిపోగానే కవిత జంతర్ మంతర్ వద్ద తాను దీక్ష చేయబోయే స్థలం వద్ద ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళారు. కాగా వేదిక మార్చుకోవడనికి కవిత అంగీకరించకపోవడంతో పోలీసులు తాము ముందుగా అనుమతి ఇచ్చిన స్థలంలో సగం స్థలమే వాడుకోవాలని కవితకు సూచించారు.

అదే స్థలంలో ధర్నా చేయడానికి బీజేపీ కూడా అనుమతి కోరుతున్నందున తమను అక్కడి నుంచి వేరే వేదిక మార్చుకోవాలని లేదా సగం స్థలమే వాడుకోవాలని పోలీసులు చెప్తున్నారని జంతర మంతర్ వద్ద కవిత చెప్పారు. ఈ క్షణం దాకా లేని బీజేపీ ధర్నా హటాత్తుగా ఇప్పుడే ఎందుకు వచ్చిందని కవిత ప్రశ్నించారు. ఎట్టి పరిస్థుతుల్లోనూ తాము ముందుగా ఇచ్చిన అనుమతి మేరకు ఇదే స్థంలో దీక్ష చేపడతామని కవిత చెప్పారు. 5వేల మంది కార్యకర్తలు ఈ దీక్షకు వస్తారని సగం స్థలం సరిపోదని ఆమె తెలిపారు.

First Published:  9 March 2023 2:30 PM IST
Next Story