నాగాలాండ్, త్రిపురలో బీజేపీ కూటమి గెలుపు, మేఘాలయలో హంగ్
నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రోగ్రెస్సీవ్ పార్టీ-బీజేపీ కూటమి విజయం సాధించింది. నాగాలాండ్ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా... ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు.
నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా మరో రాష్ట్రంలో ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు.
నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రోగ్రెస్సీవ్ పార్టీ-బీజేపీ కూటమి విజయం సాధించింది. నాగాలాండ్ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా... ఎన్డీపీపీ-బీజేపీ కూటమి 38 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 2, ఇతరులు 16 స్థానాలు గెలుచుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది.
త్రిపురలో కూడా బీజేపీ కూటమే విజయం సాధించింది. త్రిపుర అసెంబ్లీలో కూడా 60 సీట్లు ఉన్నాయి. అందులో బీజేపీ-ఐపీటీఎఫ్ కూటమి 33 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యింది. దశాబ్దాలుగా బద్ద శతృవులుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని ఓడించేందుకు చేతులు కలిపినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ కూటమి 14 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన తిప్రా మోథా పార్టీ 13 స్థానాల్లో సంచలన విజయం అందుకుంది.
ఇక, మేఘాలయ విషయానికొస్తే... ఇక్కడి ఒక అసెంబ్లీ స్థానం ఏకగ్రీవం కాగా 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. యునైటెడ్ డెమాక్రటిక్ పార్టీకి 11, తృణమూల్ కాంగ్రెస్ కు 5, బీజేపీకి 2, హెచ్ఎస్ పీడీపీకి 2, కాంగ్రెస్ కు 5, పీడీఎఫ్ కు 2, వీపీపీకి 4 స్థానాలు లభించాయి. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు.