Telugu Global
National

బిర్యానీ రాజకీయాలు

యశ్వంత్‌పూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎస్‌టి సోమశేఖర్ తన మీటింగుకు వస్తే, వచ్చిన ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతాను రమ్మంటూ ప్రచారం చేశాడు. సభల్లో కూడా ''మీటింగ్ అయ్యిందాకా ఎవ్వరూ వెళ్ళిపోకండి అందరికీ బిర్యానీ పెడతాం'' అంటూ ఆయనే స్వయంగా మైకులో ప్రకటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిర్యానీ రాజకీయాలు
X

కర్నాటక ఎన్నికలు డబ్బులు, మధ్యం, బహుమతులతో కళకళలాడుతోంది. ఓటర్లకు ప్రతి రోజూ పండుగలాగే ఉందక్కడ. తాగినోళ్ళకు తాగినంత...తిన్నోళ్ళకు తిన్నంతా...ఆ తర్వాత‌ మళ్ళీ డబ్బులు కూడా.... ప్రస్తుతం రోజు కూలీలు, ఖాళీగా తిరిగేవాళ్ళు, కాలేజీ విద్యార్థులు ప్రతిరోజూ ఏదో ఓ నాయకుడి వెంబడి తిరుగుతున్నారు. ఖర్చుకు వెనకాడని నాయకులకే ఈ సారి ఎన్నికల్లో వివిధ పార్టీలు టికట్లు ఇచ్చాయని సమాచారం.

ఇప్పుడో బీజేపీ అభ్యర్థి బిర్యానీ రాజకీయాలు అక్కడ కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన మీద కేసు కూడా నమోదయ్యింది.

యశ్వంత్‌పూర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎస్‌టి సోమశేఖర్ తన మీటింగుకు వస్తే, వచ్చిన ప్రతి ఒక్కరికీ బిర్యానీ పెడతాను రమ్మంటూ ప్రచారం చేశాడు. సభల్లో కూడా మీటింగ్ అయ్యిందాకా ఎవ్వరూ వెళ్ళిపోకండి అందరికీ బిర్యానీ పెడతాం అంటూ ఆయనే స్వయంగా మైకులో ప్రకటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో ఆయనపై జనతాదళ్ (సెక్యులర్) రాష్ట్ర న్యాయ విభాగం అధ్యక్షుడు ఎపి రంగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని సోమశేఖర్ ఉల్లంఘించారంటూ ఆయన పిర్యాదులో పేర్కొన్నారు. రంగనాథ్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ ప్రజలకు లంచం (బిర్యానీ) ఇవ్వజూపినట్టు ధృవీకరించుకొని ఆయనపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

ఇలాంటి కేసులకు రాజకీయ నాయకులు పెద్దగా చలించిన దాఖలాలు ఈ దేశంలో లేవు కానీ సోమశేఖర్ పెట్టిన బిర్యానీ తిన్నవాళ్ళంతా ఆయనకే ఓట్లేస్తారా ? లేదా ఇక్కడ తిని ఓటు మరో చోట వేస్తారా అనేది చూడాల్సి ఉంది.

First Published:  14 April 2023 7:42 PM IST
Next Story