Telugu Global
National

రేపిస్టుల విడుదల కేసు: రెమిషన్ పాలసీపై బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

రెమిషన్ పాలసీపై బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ 11 మందిని దోషులుగా నిర్దారించిన సమయంలో గుజరాత్ లో ఉన్న రిమిషన్ పాలసీ ప్రకారం చర్యలు తీసుకోవాలని మే 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బిల్కిస్ ప్రశించారు.

రేపిస్టుల విడుదల కేసు: రెమిషన్ పాలసీపై బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
X

గుజరాత్ లో సామూహిక అత్యాచారం హత్యలు చేసిన దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బాధితురాలు బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రెండు వేరు వేరు పిటిషన్ లు దాఖలు చేశారు. అందులో ఒక పిటిషన ను కోర్టు ఈ రోజు కొట్టి వేసింది.

రెమిషన్ పాలసీపై బాధితురాలు బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ 11 మందిని దోషులుగా నిర్దారించిన సమయంలో గుజరాత్ లో ఉన్న రిమిషన్ పాలసీ ప్రకారం చర్యలు తీసుకోవాలని మే 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బిల్కిస్ ప్రశించారు.

మహారాష్ట్రలో ఈ కేసు విచారణ జరిగినందున 1992 నాటి గుజరాత్ రిమిషన్ పాలసీకి బదులు, ఈ కేసులో మహారాష్ట్ర ఉపశమన విధానాన్ని వర్తింపజేయాలని రివ్యూ పిటిషన్‌లో బానో పేర్కొన్నారు.

అయితే న్యాయవాది శోభా గుప్తా ద్వారా బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

2002 గుజరాత్ అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది వ్యక్తుల విడుదలకు వ్యతిరేకంగా బానో మరో ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ దోషులు అనేక హత్యలకు పాల్పడ్డారని కూడా ఆమె ఆరోపించారు, దోషులందరినీ విడుదల చేయడం తననే కాదు, తన‌ ఎదిగిన కుమార్తెలను, కుటుంబాన్ని, భారత‌ సమాజాన్ని , అంతర్జాతీయ సమాజాన్ని కూడా షాక్ కు గురి చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు.

డిసెంబరు 13న బానో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేల ఎం. త్రివేది తప్పుకున్నారు.

ఈ కేసు విచారణ కోసం సుప్రీంకోర్టులోని మరో బెంచ్ ముందు లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

First Published:  17 Dec 2022 2:06 PM IST
Next Story