Telugu Global
National

వీడియో తీయడానికి వచ్చి..పెళ్లికొడుకు అక్కతో జంప్

పెళ్లి వీడియో తీయడానికి వచ్చిన ఓ వీడియో గ్రాఫర్.. పెళ్లి కొడుకు అక్కనే లేపుకుపోయాడు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

వీడియో తీయడానికి వచ్చి..పెళ్లికొడుకు అక్కతో జంప్
X

పెళ్లి వీడియో తీయడానికి వచ్చిన ఓ వీడియో గ్రాఫర్.. పెళ్లి కొడుకు అక్కనే లేపుకుపోయాడు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో జరిగింది. మ్యాటర్‌లోకి వెళ్తే.. చందవారా ఘాట్ దామోదర్‌పూర్ ప్రాంతంలో ఒక వ్యక్తి పెళ్లి జరిగింది. అదే ప్రాంతానికి చెందిన గోలు కుమార్ ఆ వివాహం వీడియో తీశాడు.

ఈ క్రమంలో పెళ్లికొడుకు అక్కతో చనువు పెంచుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి తమ ఇళ్ల నుంచి పారిపోయారు.

విషయాన్ని మహిళ భర్త ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో మహిళ తండ్రి వీడియోగ్రాఫర్ గోలు కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశాడు. తమకేం తెలియదని వీడియోగ్రాఫర్‌ తండ్రి చెప్పాడు. అయితే గోలు కుమార్‌ ఒక మహిళను గ్రామానికి తీసుకువచ్చాడని, ఆ తర్వాత వారిద్దరూ కలిసి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.

దీంతో మహిళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 4న మార్కెట్‌కు వెళ్లిన తన కూతురు కనిపించకుండా పోయిందని.. వీడియోగ్రాఫర్ గోలు కుమార్ తనను కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లేచిపోయిన జంట కోసం గాలిస్తున్నారు.

First Published:  13 March 2024 9:12 PM IST
Next Story