Telugu Global
National

విప‌క్షాల భేటీపై నితీశ్ కండీష‌న్‌..! - అధ్య‌క్షులే రావాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌

అన్ని పార్టీల‌నూ సంప్ర‌దించిన త‌ర్వాత స‌మావేశానికి కొత్త తేదీని సూచించాల‌ని కాంగ్రెస్ ను కోరిన‌ట్టు చెప్పారు. ఈ భేటీకి పార్టీల అధ్యక్షులు మాత్రమే రావాల‌ని, వారి తరఫున మరో వ్యక్తిని ప్రతినిధిగా పంపిస్తామంటే కుదరదని ఆయ‌న తెలిపారు.

విప‌క్షాల భేటీపై నితీశ్ కండీష‌న్‌..! - అధ్య‌క్షులే రావాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌
X

బీహార్ రాష్ట్రం ప‌ట్నాలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన విప‌క్షాల భేటీకి బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ ఒక కండీష‌న్ పెట్టారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీని ఉమ్మ‌డిగా ఎదుర్కొనే విష‌యంలో వ్యూహాన్ని రూపొందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఈ భేటీకి ఆయా పార్టీల అధ్య‌క్షులు మాత్ర‌మే రావాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప‌ట్నాలో విప‌క్షాల భేటీని జూన్ 12న నిర్వ‌హించాల‌ని తొలుత నిర్ణ‌యించ‌గా, అది వాయిదా ప‌డింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ వంటివారు జూన్ 12న అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆరోజు నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన భేటీని వాయిదా వేసిన‌ట్టు స‌మాచారం.

దీనిపై నితీశ్ స్పందిస్తూ.. అన్ని పార్టీల‌నూ సంప్ర‌దించిన త‌ర్వాత స‌మావేశానికి కొత్త తేదీని సూచించాల‌ని కాంగ్రెస్ ను కోరిన‌ట్టు చెప్పారు. ఈ భేటీకి పార్టీల అధ్యక్షులు మాత్రమే రావాల‌ని, వారి తరఫున మరో వ్యక్తిని ప్రతినిధిగా పంపిస్తామంటే కుదరదని ఆయ‌న తెలిపారు. ఉదాహరణకు.. కాంగ్రెస్ తమ అధ్యక్షుడిని కాకుండా మరో నేతను పంపించే అవకాశమున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని, దాన్ని తాము అంగీకరించబోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

First Published:  6 Jun 2023 7:16 AM IST
Next Story