ఇండోర్‌లో కాంగ్రెస్‌కు షాక్.. నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలో చేరిన అభ్యర్థి
ఇండోర్‌లో బీజేపీ అభ్యర్థికే మొగ్గుందని కథనం. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో పోటీ ఏకపక్షంగా మారింది. బరిలో ఉన్న చిన్నా చితకా పార్టీలు, ఇండిపెండెంట్లు బీజేపీకి ఎదురునిలబడే పరిస్థితి లేదు.
పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు గట్టి షాక్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అంతేకాదు బీజేపీలో కూడా చేరిపోయారు. మే 13న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు టైమ్ దాటిపోయింది. స్క్రూటినీ కూడా అయిపోయింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం అక్షయ్ నేరుగా ఆర్వో దగ్గరకు వెళ్లి విత్‌డ్రా చేసుకోవడంతో హస్తం పార్టీకి దిమ్మ తిరిగింది.
బీజేపీ గెలుపు ఇక లాంఛనమే
ఇండోర్‌లో బీజేపీ అభ్యర్థికే మొగ్గుందని కథనం. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా చేసుకోవడంతో పోటీ ఏకపక్షంగా మారింది. బరిలో ఉన్న చిన్నా చితకా పార్టీలు, ఇండిపెండెంట్లు బీజేపీకి ఎదురునిలబడే పరిస్థితి లేదు. ఇక పోటీ లాంఛనమే. బీజేపీ క్యాండెట్ శంకర్ విజయ్ గెలుపూ ఖాయమే.
ఇది రెండో షాక్..
కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఇది రెండో షాక్. ఇప్పటికే సూరత్‌లోకాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ చేసిన సంతకాలు సరైనవి కావని ఆయా వ్యక్తులు పేర్కొన్నారు. దీంతో నామినేషన్ తిరస్కరించారు. ఆ స్థానంలో ఇండిపెండెంట్లు అందరూ నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇన్నింగ్స్ మొదలుపెట్టక ముందే 2 పరుగులు!
సూరత్ దెబ్బతో ఇన్నింగ్స్ మొదలుపెట్టక ముందే బీజేపీ స్కోరు బోర్డు మీదకు ఒక రన్ వచ్చేసింది. ఇప్పుడు ఇండోర్‌లో కూడా కాంగ్రెస్ రనౌట్ అయిపోయింది. అంటే బీజేపీ బ్యాటింగ్‌కు దిగకముందే రెండు పరుగులు సాధించేసినట్లేనని కామెంట్లు వస్తున్నాయి.