సత్తా కోసం కాదు..సత్యం కోసమే' భారత్ జోడో యాత్ర -కన్హయ్యకుమార్
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సత్యం కోసమే తప్ప సత్తా కోసం కాదని కాంగ్రెస్ యువ నాయకుడు కన్హయ కుమార్ అన్నారు. ఇది రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన దేశం ఆలోచనను,స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అధికారం కోసం కాదని, సత్యం కోసమని కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ చెప్పారు. బిజెపి 1990 లో చేసిన రథయాత్ర "సత్తా (అధికారం)" కోసం అని, అయితే కాంగ్రెస్ 'భారత్ జోడో యాత్ర' సత్యం" కోసం అని ఆయన అన్నారు. భారత యాత్రీ లలో ఒకరైన కన్హయ్యకుమార్ ఈ యాత్రలో రాహుల్ గాంధీ తో పాటు కశ్మీర్ వరకూ 3,570 కిమీ నడుస్తారు. కాంగ్రెస్ ప్రయత్నం రాజకీయం కోసం కాదని అన్నారు. "ఇది రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచబడిన దేశం ఆలోచనను,స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని " ఆయన చెప్పారు.
"ప్రజల అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించే" కాంగ్రెస్ యాత్ర వెనుక ఉన్న ఆలోచనలను చెప్పాలనుకుంటున్నానన్నారు. అద్వాని చేసిన రథ యాత్ర వల్ల ఆ పార్టీకి అధికారం (సత్తా) లభించింది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర సత్యాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ దేశం ప్రతి ఒక్కరిదీ అనే సందేశాన్ని ఇస్తుంది. అని కుమార్ చెప్పారు. 1990లో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్ర అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతుగా భారీ ఉద్యమాన్ని ప్రారంభించింది, ఇది బిజెపికి రాజకీయంగా లాభించింది.
కాంగ్రెస్ యాత్ర గురించి మాట్లాడుతూ, "కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచే అవకాశం లభించడం ఏ భారతీయుడికైనా చాలా అదృష్టమని, మేము ప్రజలను కలుస్తాము, విభిన్న సంస్కృతులు, దుస్తులు, భాషలను, మనో భావాలను దగ్గర్నుంచి తెలుసుకుంటాం." అని అన్నారు. యాత్రలో సామాజిక, రాజకీయ, ఆర్థిక అనే మూడు ముఖ్యమైన అంశాలున్నాయన్నారు.
దేశం విద్వేషాలతో విడిపోతున్నదనే విమర్శలు వింటున్నాం. ఈ పరిస్థితుల్లో మనమంతా దేశం సమైక్యంగా ఉండేలా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సమైక్యత కోసమే కాంగ్రెస్ యాత్ర అన్నారు. దేశం భౌగోళికంగా, చారిత్రకంగా విభజన అవలేదు.. కానీ ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశాలు విధానాలను పరిశీలిస్తే, ధనిక పేద వర్గాల మధ్య భారీ అంతరం ఉంది, "అని ఆయన అన్నారు. కార్పొరేట్‌లకు పన్ను మినహాయింపు ఇస్తూ పేదలపై ప్రభావం చూపే పాలు, పెరుగుపై జీఎస్టీ విధిస్తున్నారని విమర్శించారు.
యాత్ర లక్ష్యాల గురించి మాట్లాడుతూ, "నేను బీహార్ నుండి వచ్చాను.కోవిడ్ సమయంలో ఏమి జరిగిందో అంతా చూశారు. ప్రజలు గుర్గావ్ , ముంబై నుండి బీహార్ వరకు నడిచారు కదా. మరి రాజకీయ నాయకులు నడవకూడదా?" అని అన్నారు. అనేక ఇతర అంశాల వల్ల ఈ యాత్ర బిహార్ వెళ్ళడం లేదు. ఇది దక్షిణం నుండి ఉత్తరం లేదా తూర్పు నుండి పడమర కు సాగుతుంది కావచ్చు. "ఇప్పుడు మనం దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్తున్నాము.' అని చెప్పారు. కానీ ఇతర రాష్ట్రాల్లో యాత్రలు 'ఉప యాత్రలు'గా నిర్వహిస్తారు.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమై తిరువనంతపురం, కొచ్చి, నిలంబూర్, మైసూరు, బళ్లారి, రాయచూర్, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, అల్వార్, బులంద్‌షహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్‌కోట్ మీదుగా ఉత్తరం వైపు సాగుతుంది. కశ్మీర్ లో ముగుస్తుంది.
యాత్రలో పాల్గొనే వారిని "భారత్ యాత్రికులు", "అతిథి యాత్రికులు", "ప్రదేశ్ యాత్రికులు ,"వాలంటీర్ యాత్రికులు"గా వర్గీకరించారు. యాత్ర యొక్క ట్యాగ్‌లైన్ "మిలే కదమ్, జూడే వతన్" గా పేర్కొన్నారు. కన్హయ కుమార్ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం మాజీ అధ్యక్షుడు.