Telugu Global
National

భర్తను, కొడుకును వదిలేసి ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది .. కానీ ఇక్కడ

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిందన్న ఆరోపణలతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేయ‌గా, ఆమెతో ప్రేమ, పెళ్లి కథ‌లు చెప్పిన ప్రియుడు మాత్రం ప‌రార‌య్యాడు.

భర్తను, కొడుకును వదిలేసి ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది .. కానీ ఇక్కడ
X

భర్తను, కొడుకును వదిలేసి ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది .. కానీ ఇక్కడ

ప్రేమకి ఎల్లలు లేవు అన్నది నిజమో కాదో తెలియదు కానీ అది నిజమేనని గట్టిగా నిరూపించడానికి ప్రయత్నించేవాళ్ళు మాత్రం ఈ రోజుల్లో బాగా ఎక్కువ అయిపోయారు. ప్రేమ పేరుతో పాకిస్తాన్ నుంచి దేశ సరిహద్దులు దాటిన మహిళ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తరువాత కూడా ఇలాంటి సంఘటనలు చాలా చూశాం.

ఇది కూడా అలాంటి ఘటనే కానీ ఈ కథ‌లో చిన్న మార్పు ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళ భర్త, కుమారుడ్ని వదిలేసి ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి భారత్ వచ్చేసింది. సహజీవనం కూడా మొదలుపెట్టింది, అయితే భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిందన్న ఆరోపణలతో పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేయ‌గా, ఆమెతో ప్రేమ, పెళ్లి కథ‌లు చెప్పిన ప్రియుడు మాత్రం ప‌రార‌య్యాడు.

వివరాల్లోకి వెళితే ..

బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, ఉత్తర త్రిపుర, ధర్మనగర్ సబ్ డివిజన్ పరిధిలోని ఫుల్‌బరీ‌లో ఒక మహిళ నివాసం ఉంటున్నాదన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

అక్కడ స్థానికంగా నివాసం ఉండే నూర్ జలాల్ అనే వ్యక్తి(34) ఆయుర్వేదం డాక్టర్‌గా ఉంటూ బంగ్లాదేశ్‌లోని మౌల్వీ మార్కెట్‌కు తరచుగా వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఫతేమా నుస్రత్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మైకంలో మునిగిన ఫతేమా క‌ట్టుకున్న‌ భర్తను, కుమారుడ్ని వదిలేసి అక్రమంగా దేశ సరిహద్దులు దాటి భారత్‌లోకి అడుగుపెట్టింది.

ఆమె అక్రమంగా ప్రవేశించిన విషయాన్ని ధృవీకరించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. మహిళను 14 రోజలపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నామని ఫతేమా చెబుతోంది. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు నూర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామన్నారు.

First Published:  28 Oct 2023 12:50 PM IST
Next Story