Telugu Global
National

భారత్ జోడో యాత్ర‌ను మెచ్చుకున్న రాందేవ్... ఆయన మెడిసిన్ పై బ్యాన్ ను రెండురోజుల్లో ఎత్తేసిన బీజేపీ సర్కార్

రక్తపోటు, మధుమేహం, గాయిటర్, గ్లాకోమా మరియు గ్లాకోమా వంటి వాటికి ఔషధాలుగా ప్రచారం చేయబడుతున్న Bpgrit, Madhugrit, Thyrogrit, Lipidom మాత్రలు,Eyegrit గోల్డ్ మాత్రలు వంటి ఐదు ఉత్పత్తుల ఉత్పత్తిని నిలిపివేయాలని అథారిటీ తన మునుపటి ఆర్డర్‌లో దివ్య ఫార్మసీని కోరింది.ఆ ఆర్డర్‌ను సవరిస్తూ, ఆ ఐదు ఔషధాల ఉత్పత్తిని కొనసాగించడానికి సంస్థకు అనుమతిస్తూ అధికారులు శనివారం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

భారత్ జోడో యాత్ర‌ను మెచ్చుకున్న రాందేవ్... ఆయన మెడిసిన్ పై బ్యాన్ ను రెండురోజుల్లో ఎత్తేసిన బీజేపీ సర్కార్
X

మధుమేహం, రక్తపోటు, గాయిటర్, గ్లాకోమా. అధిక కొలెస్ట్రాల్‌కు సంబంధించిన ఐదు ఔషధాల ఉత్పత్తిని నిలిపివేయాలని యోగా గురువు రామ్‌దేవ్ కు చెందిన దివ్య ఫార్మసీని కోరుతూ ఉత్తరాఖండ్ ఆయుర్వేద, యునాని లైసెన్సింగ్ అథారిటీ ఈ నెల 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రెండురోజుల్లో అంటే 11వ తేదీ కల్లా ఏం జరిగిందో రాందేవ్ ఎక్క డ స్విచ్వేస్తే ఎక్కడ లైట్ వెలిగిందో తెలియదు కానీ 12 తేదీ పొద్దున్నే ఉత్తరాఖండ్ ఆయుర్వేద,యునాని లైసెన్సింగ్ అథారిటీ నుంచి ఆగ‌మేఘాల‌ మీద మరో ఉత్తర్వు జారీ అయ్యింది.

మునుపటి ఆర్డర్‌ను సవరిస్తూ, ఆ ఐదు ఔషధాల ఉత్పత్తిని కొనసాగించడానికి సంస్థకు అనుమతిస్తూ అధికారులు శనివారం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

నవంబర్ 9 నాడు ఇచ్చిన‌ ఆర్డర్‌లో లోపం ఉందని గమనించి తాము హడావుడిగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోగ్య అథారిటీ డ్రగ్ కంట్రోలర్ జిసిఎన్ జంగపాంగి చెప్పారు.

"ఆర్డర్ జారీ చేయడానికి ముందు కంపెనీ తన స్టాండ్‌ను వివరించడానికి మేము సమయం ఇచ్చి ఉండాలి" అని జంగ్‌పాంగి చెప్పారు.

లోపాన్ని సరిదిద్దినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రామ్‌దేవ్ సన్నిహితుడు, కంపెనీ సీఈఓ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

రక్తపోటు, మధుమేహం, గాయిటర్, గ్లాకోమా మరియు గ్లాకోమా వంటి వాటికి ఔషధాలుగా ప్రచారం చేయబడుతున్న Bpgrit, Madhugrit, Thyrogrit, Lipidom మాత్రలు,Eyegrit గోల్డ్ మాత్రలు వంటి ఐదు ఉత్పత్తుల ఉత్పత్తిని నిలిపివేయాలని అథారిటీ తన మునుపటి ఆర్డర్‌లో దివ్య ఫార్మసీని కోరింది.

అధికారులు సవరించిన ఫార్ములేషన్ షీట్‌లను ఆమోదించిన తర్వాత మాత్రమే కంపెనీ ఈ ఉత్పత్తుల తయారీని పునఃప్రారంభించవచ్చని మునుపటి ఆర్డర్ పేర్కొంది.

దివ్య ఫార్మసీ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్, (అభ్యంతరకరమైన ప్రకటన) చట్టం,డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్‌ను ఉల్లంఘించిందని కేరళకు చెందిన డాక్టర్ కెవి బాబు చేసిన ఫిర్యాదు మేరకు నవంబర్ 9న చర్య తీసుకున్నారు.మరి నవంబర్ 12వ తేదీకల్లా ఏం మార్పులు జరిగాయో ఉత్తరఖండ్ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు.

అన్నట్టు ఈ మధ్య బాబా రాందేవ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను పదే పదే మెచ్చుకున్నాడు.

First Published:  14 Nov 2022 2:28 AM GMT
Next Story