Telugu Global
National

మాకు పెళ్ళిళ్ళు కాకపోవడానికి ప్రభుత్వమే కారణం... బ్రహ్మచారుల నిరసన ర్యాలీ

మహారాష్ట్ర, షోలాపూర్ లో జరిగిన ఈ ఊరేగింపు అక్కడ సంచలనం గామారింది. 'పెళ్లికూతురు మోర్చా' పేరుతో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీ 'జ్యోతి క్రాంతి పరిషత్' అనే సంస్థ నిర్వహించింది.

మాకు పెళ్ళిళ్ళు కాకపోవడానికి ప్రభుత్వమే కారణం... బ్రహ్మచారుల నిరసన ర్యాలీ
X

పెళ్ళి వస్త్రాలు ధరించి, గుర్రాల మీద ఎక్కి బ్యాండ్ బాజాలతో కొందరు ఊరేగింపు తీశారు. అయితే అది పెళ్ళి ఊరేగింపు కాదు. పెళ్ళికాని ప్రసాదుల ఊరేగింపు. తమకు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదని, దీనికి ప్రభుత్వమే కారణమని ఆ ఊరేగింపులో పాల్గొన్న వారు ఆరోపించారు.

మహారాష్ట్ర, షోలాపూర్ లో జరిగిన ఈ ఊరేగింపు అక్కడ సంచలనం గామారింది. 'పెళ్లికూతురు మోర్చా' పేరుతో నిర్వహించిన ఈ నిరసన ర్యాలీ 'జ్యోతి క్రాంతి పరిషత్' అనే సంస్థ నిర్వహించింది.

ర్యాలీ నిర్వహించిన బ్రహ్మచారులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఓ మెమోరాండం ఇచ్చారు. మహారాష్ట్రలో స్త్రీ-పురుషుల నిష్పత్తిని మెరుగుపరచడానికి ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆ మెమోరాండంలో కోరారు.

మహా రాష్ట్రలో స్త్రీ, పురుషుల రేషియో దారుణంగా దిగజారిపోయినందువల్లే తమకు పెళ్ళుళ్ళు జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రజలు మా ర్యాలీని అపహాస్యం చేయవచ్చు, కానీ భయంకరమైన వాస్తవం ఏమిటంటే, రాష్ట్రంలో స్త్రీ-పురుషుల నిష్పత్తి దారుణంగా ఉన్నందువల్ల‌ వివాహ వయస్సులో ఉన్న యువతకు వధువులు లభించడం" అని 'జ్యోతి క్రాంతి పరిషత్ 'వ్యవస్థాపకుడు రమేష్ బరాస్కర్ అన్నారు.

మహారాష్ట్రలో చాలా ఎక్కువ అసమానత ఉందని బరాస్కర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో1,000 మంది అబ్బాయిలకు 889 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.

''ఆడపిల్లల‌ భ్రూణహత్యల కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. ఈ అసమానతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి" అని బరాస్కర్ అన్నారు

కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన యువకులు ఆడ భ్రూణహత్యల నిషేధానికి, లింగ నిర్ధారణను పటిష్టం చేసేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) డేటా 2021 ప్రకారం, మహారాష్ట్రలోని 17 జిల్లాలతో పాటు పూణేలో లింగ నిష్పత్తిలో స్త్రీల జనాభాలో గణనీయమైన తగ్గుదల కనిపించిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.

First Published:  22 Dec 2022 5:14 PM IST
Next Story