Telugu Global
National

ఏటీఎంలో దొంగనోట్లు.. యోగి సర్కారుపై సెటైర్లు

"యోగీజీ.. మీరు సాధించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీకు సాటి ఎవరూ లేరు. అసలు నోట్లకు, నకిలీ నోట్లకు ప్రజలు స్పష్టంగా తేడా తెలుసుకోగలుగుతున్నారు." అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏటీఎంలో దొంగనోట్లు.. యోగి సర్కారుపై సెటైర్లు
X

ఏటీఎంలో దొంగనోట్లు వస్తే బ్యాంకు వాళ్లదే బాధ్యత, అయితే ఇక్కడ అనూహ్యంగా సోషల్ మీడియాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ టార్గెట్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేధీలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏటీఎంలో దొంగనోట్లు రావడంతో నెటిజన్లంతా యోగిపై సెటైర్లు పేలుస్తున్నారు. "యోగీజీ.. మీరు సాధించారు. శాంతిభద్రతల పరిరక్షణలో మీకు సాటి ఎవరూ లేరు. మీ సారధ్యంలో బ్యాంకులు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాయి. అసలు నోట్లకు, నకిలీ నోట్లకు ప్రజలు స్పష్టంగా తేడా తెలుసుకోగలుగుతున్నారు." అంటూ కామెంట్లు పెడుతున్నారు.

యూపీలోని అమేధీలో దీపావళి రోజు డబ్బులు డ్రా చేసిన వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఏటీఎం ఏ బ్యాంక్ ది అనే సంగతి చెప్పలేదు కానీ, అమేధీలో ఓ బ్యాంక్ ఏటీఎం నుంచి 200 రూపాయల నోట్లు వచ్చినట్టు వీడియో పోస్ట్ చేశారు ఓ మహిళా జర్నలిస్ట్. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ 200 రూపాయల నోటుపై ఫుల్ ఆఫ్ ఫన్, చిల్డ్రన్ ఆఫ్ ఇండియా అనే అక్షరాలు రాసి ఉన్నాయి.

మామూలుగా పిల్లలు ఆడుకోడానికి ఇలా నకిలీ నోట్లను తయారు చేస్తుంటారు. దానిపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ ప్రింట్ చేస్తుంటారు, రకరకాల కామెంట్లు ఆ నోట్లపై యాడ్ చేస్తుంటారు. కానీ ఇలాంటి నోట్లు ఇప్పుడు ఏటీఎంలోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు నోట్లను పోలి ఉండే నకిలీ నోట్లతోపాటు, ఇలా పిల్లలకోసం తయారు చేసే నోట్లు కూడా ఏటీఎంలలో దర్శనమీయడం సంచలనంగా మారింది. పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ నకిలీ నోట్ల వ్యవహారం వైరల్ గా మారింది.

First Published:  26 Oct 2022 4:40 PM IST
Next Story