Telugu Global
National

గాంధీ కంటే మోదీ గొప్పోడా..? దమ్ముంటే ఆ సినిమా బ్యాన్ చేయండి

మోదీ పరువు తీశారంటూ గింజుకుంటున్న భక్తులు, గాంధీ గంటే మోదీ గొప్పవాడనుకుంటున్నారా అని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. గాంధీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా చిత్రీకరించిన ఆ సినిమాపై నిషేధం విధించగలరా అని ప్రశ్నించారు.

గాంధీ కంటే మోదీ గొప్పోడా..? దమ్ముంటే ఆ సినిమా బ్యాన్ చేయండి
X

మోదీపై డాక్యుమెంటరీ వేశారంటూ భక్తులు గగ్గోలు పెడుతున్నారు. కడిగిన ముత్యం మా మోదీ అంటూ మరోసారి రెచ్చిపోతున్నారు. సంచలనం కోసమే ఆ డాక్యుమెంటరీ ప్రసారం చేశారంటూ బీబీసీపై అంతెత్తున ఎగిరిపడుతున్నారు. చివరకు సోషల్ మీడియా నుంచి ఆ డాక్యుమెంటరీ లింకుల్ని తొలగించి చంకలు గుద్దుకుంటున్నారు. మోదీ సంగతి సరే.. మోదీని వేలెత్తి చూపించే సరికి చాలామంది విలవిల్లాడిపోయారు. మరి గాంధీ కంటే మోదీ గొప్పోడా అని ప్రశ్నిస్తున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. దమ్ముంటే "గాంధీ - గాడ్సే.. ఏక్ యుద్ధ్" అంటూ వస్తున్న సినిమాని బ్యాన్ చేయాలని ఆయన కేంద్రానికి సవాల్ విసిరారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలవుతున్న ఆ సినిమాలో గాంధీ ఔన్నత్యాన్ని తక్కువచేసి చూపించే సన్నివేశాలున్నాయని మండిపడ్డారు ఒవైసీ.



గాడ్సే భక్తులు..

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గాంధీని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాంధీని కాల్చి చంపిన గాడ్సేని కూడా దేశభక్తుడిగా చూపించాలని తాపత్రయ పడుతున్నారు కొంతమంది. ఆమధ్య గాడ్సే చిత్రపటాలతో ర్యాలీ కూడా నిర్వహించారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సాను భూతిపరులు. ఇది ఇక్కడితో ఆగలేదు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాడనే కారణాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ ఓ సినిమా రెడీ చేసారు. రాజ్ కుమార్ సంతోషి ఈ సినిమా దర్శకుడు. ఇది గాడ్సే కోణంలో తీసిన సినిమాగా విమర్శలు ఎదుర్కొంటోంది. గాడ్సేపై సింపతీ కలిగేలా ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా రెడీ చేశారట. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తాను ముందే చూశానని, అలాంటి సినిమాని ఎలా విడుదల చేస్తున్నారంటూ ప్రశ్నించారు అసదుద్దీన్.

గాంధీ కంటే మోదీ గొప్పవాడా..?

మోదీ పరువు తీశారంటూ గింజుకుంటున్న భక్తులు, గాంధీ గంటే మోదీ గొప్పవాడనుకుంటున్నారా అని మండిపడ్డారు అసదుద్దీన్ ఒవైసీ. గాంధీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా చిత్రీకరించిన ఆ సినిమాపై నిషేధం విధించగలరా అని ప్రశ్నించారు. భారత్ లో ఇంత వివక్ష ఎందుకని ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ ముఖ్యమంత్రిగా లేరా, బిల్కిస్ బానో రేప్ జరిగినప్పుడు ఆయన అధికారంలో లేరా, కాంగ్రెస్ ఎంపీని చంపేసినప్పుడు మోదీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు అసదుద్దీన్. అసదుద్దీన్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

First Published:  23 Jan 2023 12:49 PM IST
Next Story