కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించకూడదని, కానీ పార్టీ చీఫ్‌గా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని తెలిపింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని కేజ్రీవాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 1న పార్లమెంట్ ఎన్నికల చివరి ఫేజ్ ముగియనుంది. ఇక ఢిల్లీ పరిధిలోని 7 పార్లమెంట్ స్థానాలకు మే 25న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి తిహార్ జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించింది. ఎన్నికలలో ప్రచారం చేయాలన్నది ప్రాథమిక హక్కు కాదని, రాజ్యాంగ హక్కు కూడా కాదని వాదనలు వినిపించింది ఈడీ. కనీసం న్యాయపరమైన హక్కు కూడా కాదని తెలిపింది ఈడీ. అయితే ఈడీ వాదనలను కేజ్రీవాల్ తరపున లాయర్లు తీవ్రంగా తప్పు పట్టారు.