రెండేళ్లలో ఇండిగో నుంచి ఎయిర్ ట్యాక్సీ.. ఇక గాల్లో ఎగిరిపోవచ్చు
ఎయిర్‌ట్యాక్సీ సేవలను తొలుత దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించాలన్నది ఇండిగో ప్లాన్. గాల్లో ఎగిరే ఈ ట్యాక్సీలు ప్రయాణ సమయాన్ని బాగా ఆదా చేస్తాయి.
సిటీ బస్సులు, క్యాబ్‌లు, మెట్రోలు అయిపోయాయి. తర్వాత స్టెప్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలదే. పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ సేవలను ఇండియాలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇండిగో మాతృసంస్థ ఇంటర్బ్ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్‌లో 2026లో ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అమెరికా సంస్థ ఆర్చర్ ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇంటర్బ్ ఎంటర్‌ప్రైజస్‌కు.. ఆర్చర్ ఏవియేషన్ విద్యుత్తుతో నడిచే 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (ఇవీటీఓఎల్) విమానాలను సరఫరా చేయనుంది. ఇందులో పైలట్‌తోపాటు నలుగురు ప్రయాణించొచ్చు. ఇవి హెలీకాప్టర్ల మాదిరిగా పనిచేస్తాయి. అయితే తక్కువ శబ్దం, అధిక భద్రతను కలిగి ఉంటాయి. 200 ఈవీటీఈవోఎల్ ధర దాదాపు రూ.8,300 కోట్లు. ఢిల్లీతో పాటు ముంబయి, బెంగళూరుల్లో కూడా ఎయిర్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని ఇంటర్బ్ఆర్చర్ ఏవియేషన్ సంయుక్త సంస్థ చూస్తోంది.
తొలుత ఢిల్లీలో ప్రారంభం
ఎయిర్‌ట్యాక్సీ సేవలను తొలుత దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించాలన్నది ఇండిగో ప్లాన్. గాల్లో ఎగిరే ఈ ట్యాక్సీలు ప్రయాణ సమయాన్ని బాగా ఆదా చేస్తాయి. ఉదాహరణకు ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే కన్నాట్ ప్లేస్ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు మధ్య దూరం 32 కి.మీ. బస్సులో కార్లో ఎలా వెళ్లినా గంటన్నర పడుతుంది. మెట్రోకు వెళ్లాలన్నా 52 నిమిషాలు. కానీ ఎయిర్‌ట్సాక్సీతో కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ఇండిగో ప్రకటించింది.
ఛార్జీ రూ. 3వేల వరకు
కన్నాట్ ప్లేస్ నుంచి గురుగ్రామ్ మధ్య 7 నిమిషాల ప్రయాణానికి ఛార్జీ రూ.2000- 3000 వరకు ఉండొచ్చని ఆర్చర్ ఏవియేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ విమానానికి సర్టిఫికేషన్ ప్రక్రియ తుది దశల్లో ఉందని ఆర్చర్ ఏవియేషన్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ గోల్డ్ స్టీన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో సర్టిఫికేషన్ రావొచ్చని, అనంతరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వద్ద అనుమతుల ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు.
5 సీట్ల ట్యాక్సీలు
ఈ ఎయిర్ ట్యాక్సీల్లో ఐదు సీట్లు ఉంటాయి. పూర్తి ఛార్జింగ్‌కు 30-40 నిమిషాలు పడుతుంది. ఒక నిమిషం ఛార్జింగ్‌తో ఒక నిమిషం ప్రయాణించవచ్చని, అంటే మొత్తం ఛార్జింగ్‌తో 30, 40 కి.మీ. ప్రయాణించే అవకాశాలున్నట్లు ఆర్చర్ ఏవియేషన్ చెబుతోంది.