Telugu Global
National

కేర‌ళ‌లో ఏపీ శ‌బ‌రిమ‌ల యాత్రికుల బ‌స్సుకు ప్ర‌మాదం.. - ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ ఆరా

ఏపీకి చెందిన భ‌క్తుల బృందం మొత్తం మూడు బ‌స్సుల్లో శ‌బ‌రిమ‌ల వెళ్లారు. ఆ మూడు బ‌స్సులూ తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో ఒక బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది.

కేర‌ళ‌లో ఏపీ శ‌బ‌రిమ‌ల యాత్రికుల బ‌స్సుకు ప్ర‌మాదం.. - ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ ఆరా
X

కేర‌ళ‌లో ఏపీ శ‌బ‌రిమ‌ల యాత్రికుల బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. శ‌నివారం ఉద‌యం 8.10 గంట‌ల స‌మ‌యంలో ప‌త‌నం మిట్ట వ‌ద్ద లాహ ల్యాంప్ బోట్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌మాదానికి గురైన బస్సులో 44 మంది ప్ర‌యాణిస్తున్నారు. వారిలో 18 మంది గాయ‌ప‌డ్డారు. వారిలో ఒక చిన్నారి స‌హా ఆరుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు స‌మాచారం. గాయ‌ప‌డిన‌వారిని అక్క‌డి అధికారులు కొట్టాయం మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఏపీకి చెందిన భ‌క్తుల బృందం మొత్తం మూడు బ‌స్సుల్లో శ‌బ‌రిమ‌ల వెళ్లారు. ఆ మూడు బ‌స్సులూ తిరిగి వ‌స్తున్న స‌మ‌యంలో ఒక బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. ఘాట్ రోడ్డు వ‌ద్ద స్టీరింగ్ ప‌ట్టేయ‌డంతో బ‌స్సు వెన‌క్కి వ‌చ్చి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన‌వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏలూరు మండ‌లం మాదేప‌ల్లి ప్రాంత వాసులుగా అధికారులు గుర్తించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎంఓ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్ర‌మాదానికి గురైన వారికి స‌రైన స‌హాయం అందించేలా చూడాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించడమే కాకుండా, యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలన్నారు.

First Published:  19 Nov 2022 4:06 PM IST
Next Story