కోహ్లీకి కొడుకు పుట్టాడోచ్!
కోహ్లీ తన భార్య అనుష్క శర్మ డెలివరీ సమయంలో దగ్గరుండేందుకే సెలవు తీసుకున్నాడు. అంతా సవ్యంగా జరిగి ఈ నెల 15న విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు.
BY Telugu Global21 Feb 2024 7:51 AM IST
X
Telugu Global Updated On: 21 Feb 2024 7:51 AM IST
క్రికెట్ అంటే ప్రాణమిచ్చే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు ఎందుకు దూరమయ్యాడు..? అంత అత్యవసరం ఏమొచ్చింది..? అభిమానులను తొలిచేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ డెలివరీ సమయంలో దగ్గరుండేందుకే సెలవు తీసుకున్నాడు. అంతా సవ్యంగా జరిగి ఈ నెల 15న విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
చాలా సంతోషంగా ఉంది
ఎంతో సంతోషంతో మీ అందరితో ఈ విషయం పంచుకుంటున్నాం. ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చాం. వామికకు తోడుగా మా అకే (పిల్లాడి పేరు)ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాం. చిన్నారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం అని కోహ్లీ అనుష్క శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Next Story