Telugu Global
National

మరో 75 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తాం

త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందన్న ప్రధాని

మరో 75 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తాం
X

త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్‌ సీట్లను జోడించామని.. రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని మెడికల్‌ స్టూడెంట్స్‌కు ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ఆయుష్మాన్‌ హెల్త్‌ సెంటర్స్‌ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయన్నారు. దేశంలో సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలు దీనిద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. బీహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేసి రూ. 12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆవిష్కరించారు.

నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆటవిక రాజ్యంగంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు.గత ప్రభుత్వాలు తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని.. కానీ రాష్ట్రంలో నితీశ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. మునుముందు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  13 Nov 2024 2:14 PM IST
Next Story