చైనాకు చెందిన 232 బెట్టింగ్, లోన్ యాప్ లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
ఈ బెట్టింగ్ , లోన్ యాప్ ల వల్ల లక్షలాది మంది అప్పులపాలవడమే కాక వారి వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాక ఈ యాప్ లు భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయని కేంద్రం ప్రభుత్వ ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వం మరో 232 చైనా యాప్ లను నిషేధించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్ లు కాగా, 94 లోన్ యాప్ లున్నాయి.
ఈ బెట్టింగ్ , లోన్ యాప్ ల వల్ల లక్షలాది మంది అప్పులపాలవడమే కాక వారి వేధింపులు భరించలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాక ఈ యాప్ లు భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయని కేంద్రం ప్రభుత్వ ఆరోపించింది. ఈ యాప్ ల ద్వారా చైనా మన దేశం మీద నిఘా పెడుతోందని ఆరోపణలున్నాయి.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) చైనాకు చెందిన 138 బెట్టింగ్ యాప్ లు, 94 లోన్ లెండింగ్ యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధించడానికి,బ్లాక్ చేయడానికి కావాల్సిన ప్రక్రియను ప్రారంభించింది.
ఈ యాప్‌లు భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగించే మెటీరియల్ ని కలిగి ఉన్నందున IT చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం చర్యలు ప్రారంభమయ్యాయి. అని న్యూస్18 నివేదించింది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధం కాబట్టి, ఈ బెట్టింగ్ యాప్ లు, వినియోగదారుల రక్షణ నిబంధనల ప్రకారం, చట్టం 2019, కేబుల్ టీవీ నెట్‌వర్క్ నియంత్రణ చట్టం 1995, IT నియమాలు 2021 ప్రకారం చట్టవిరుద్ధమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) జారీ చేసిన నోట్ లో పేర్కొంది.
గతంలో కూడా మన దేశం 290 చైనా యాప్ లను నిషేధించిన విషయం తెలిసిందే. చాలా మటుకు చైనా యాప్ లు మన దేశానికి చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించుకొని తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి.